కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి (167వ నంబర్) విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు లైన్లతో రోడ్డు నిర్మిస్తుండగా పనులు 90శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు నత్తనడకన సాగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో కేంద్రం 214కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1200కోట్లు కేటాయించగా పనుల్లో వేగం పెరిగింది.
రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. అవి 1.జడ్చర్ల – కల్వకుర్తి 2.కల్వకుర్తి – మల్లేపల్లి 3.మల్లేపల్లి – హాలియా (అలీనగర్) 4.అలీనగర్ – మిర్యాలగూడ 5.మిర్యాలగూడ -కోదాడ.
హైవే రోడ్డు నిర్మాణ పనుల్లో బీటీ రోడ్డు 90శాతం పూర్తయ్యింది. హాలియా, రంగారెడ్డిగూడెం, పెద్దవూర తదితర గ్రామాల్లో వంతెనలు నిర్మించాల్సి ఉంది. 214కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో 10కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. అనుముల మండలం అలీనగర్ వద్ద ఫ్లై ఓవర్, హుజూర్నగర్-గరిడేపల్లి మధ్య 10కిలోమీటర్లు, చారగొండ వద్ద 2కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే పనులు పూర్తయినట్లే. ఈ ఏడాది నవంబర్ చివరి వరకు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ జాతీయ రహదారిలో గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట నాలుగు లైన్ల రోడ్డు వేశారు. వీటి మధ్యలో డివైడర్తోపాటు రోడ్డుకు ఇరువైపులా సీసీ డ్రెయిన్లు, ఫుట్పాత్లు నిర్మించారు. రోడ్డు మధ్యలో బటర్ఫ్లై విద్యుత్ స్తంభాలు అమర్చారు.
హాలియాలో 40ఫీట్ల రోడ్డును 50ఫీట్లకు విస్తరిస్తున్నారు. దీంతో దుకాణాదారులు తమ భవనాలను 10ఫీట్ల మేర కూల్చి మరమ్మతులు చేసుకుంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా సీసీ, డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. రోడ్డు వెడల్పుతో హాలియా పట్టణం సుందరంగా మారే అవకాశం ఉంది.
రూ.కోట్లలో
జడ్చర్ల-కల్వకుర్తి 44 280
కల్వకుర్తి – మల్లేపల్లి 50 300
మల్లేపల్లి – అలీనగర్ 40 300
అలీనగర్ – మిర్యాలగూడ 40 170
మిర్యాలగూడ – కోదాడ 40 250