మఠంపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు సూచించారు. ఆదివారం మండలంలోని యాతవాకిళ్ల, చౌటపల్లి, మట్టపల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా గ్రామశాఖల అధ్యక్షులుగా బుడిగ నాగులు, వీరంరెడ్డి వీరారెడ్డి, కంబాల మురళీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొండానాయక్, సాముల పుల్లారెడ్డి, జడ్పీటీసీ జగన్నాయక్, భూక్య అశోక్, ఎంపీటీసీ నాగిరెడ్డి, సర్పంచులు కోలాహలం లక్ష్మీనరసింహరాజు, దాసరి విజయలక్ష్మీవెంకటరమణ, గుండెపంగు కృష్ణవేణి పాల్గొన్నారు.
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు..
కోదాడ రూరల్ : పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్ అన్నారు. ఆదివారం మంగలితండా, చిమిర్యాల టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక సన్నాహక సమావేశాన్ని మంగలితండాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో మండల ఎన్నికల పరిశీలకుడు నంద్యాల రాంరెడ్డి, జడ్పీ కో-ఆఫ్షన్ సభ్యుడు జానీమియా, గండ్ర యాదగిరి, ఎంపీటీసీ శంకర్‌శెట్టి కోటేశ్వరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ నాగేశ్వర్ రావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ధరావత్ బాబ్జి, యరమాల క్రాంతికుమార్, నాయకులు జబ్బార్, బురేల కరుణాకర్‌రావు, గడిపూడి శ్రీకాంత్, లాల్‌సాహెబ్, నెల్లూరి బ్రహ్మయ్య, అప్పారావు, వాసు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి…
మోతె : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు సూచించారు. ఆదివారం మండలంలోని బీక్యాతండా, భల్లుతండా, లాల్తండాలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీక్యాతండా గ్రామశాఖ అధ్యక్షుడిగా బానోతు సైదులును ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిరికొండ పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి వెంకట్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు యుగేందర్‌రెడ్డి, లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకుడు ఏలూరి వెంకటేశ్వర్రావు, సర్పంచ్ బానోతు ఝాన్సీబాబూనాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ హలావత్ మదార్, బానోతు దేవులా నాయక్, వార్డు సభ్యులు రవీందర్, నాగులు, రంగా, రమేశ్, వెంకన్న, బీక్యా, వీరస్వామి, వీరన్న పాల్గొన్నారు.
మరింత పటిష్టం చేయాలి..
నడిగూడెం : టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేయాలని కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి గ్రామ కమిటీ బాధ్యులకు సూచించారు. ఆదివారం మండలంలోని రామచంద్రాపురం, కరివిరాల, కేశవాపురంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, కార్యదర్శి బడేటి చంద్రయ్య, నాగన్న, గడ్డం మల్లేశ్‌యాదవ్, గౌస్, దాసరి శ్రీను, లింగారెడ్డి, దేవబత్తిని వెంకటనర్సయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలేనిగూడెం గ్రామ కమిటీ..
చిలుకూరు : మండలంలోని పోలేనిగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గాన్ని అధికారికంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ త్వరలో ప్రకటించనున్నట్లు ముఖ్య నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతీకోటయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీషానాగేంద్రబాబు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దొడ్డా సురేశ్‌బాబు, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు వట్టికూటి నాగయ్య, సర్పంచ్ బండ్ల వెంకటయ్య, నాయకులు బాదె ఆంజనేయులు, బాదె లింగయ్య, సీతక్క, నరేశ్ పాల్గొన్నారు.