నీలగిరి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఉన్నతాధికారులకు వివరించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి మాడ్యూల్స్ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్న విధానాన్ని కలెక్టర్ వివరించారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ధరణీ వ్యవస్థ ప్రారంభం నుంచి రాష్ట్రంలో సుమారు 8లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహాన్ పాల్గొన్నారు.