తుర్కపల్లి, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్‌తోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్య కారులకు అందిస్తున్న 1.80లక్షల చేపపిల్లలను అదనపు కలెక్టర్ దీపక్తీవారీతో కలిసి ఆదివారం మండలంలోని మాదాపురం గ్రామంలోని చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. సమైక్య రాష్ట్రంలో అణిచివేతకు గురైన కులవృత్తులు స్వరాష్ట్రంలో తిరిగి ప్రాణం పోసుకున్నాయన్నారు. మత్స్య కారులకు సబ్సిడీ కింద ప్రభుత్వం ఆటోలు, డీసీఎంలు, ద్విచక్రవాహనాలు, వలలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఎంపీపీ సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వయంప్రభ కుటుంబానికి పరామర్శ
బొమ్మలరామారం : తిమ్మాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు మూగల స్వయంప్రభకు ఇటీవల మాతృవియోగం జరిగింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆదివారం స్వయంప్రభ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.