మిన్నంటిన సంబురాలు
హోరెత్తిన జై తెలంగాణ నినాదాలు
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా వార్డుల నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, కోలాటాలతో ఆడుతూ పాడుతూ పటాకులు పేల్చి, కేక్‌లు కట్ చేశారు.పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మహిళలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. 31వ వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, 22వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ సిగ సత్యం, 32వ వార్డులో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, కౌన్సిలర్ జహీర్ ఆధ్వర్యంలో ఓ మహిళ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ వార్డు ఇన్చార్జిలు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్థాపించిన గులాబీ పార్టీతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న ప్రతీ సమస్యనూ పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీ పటిష్టకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుమలగిరి మండలంలో…
తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగను గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పార్టీ జెండా ఎగురవేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీ, మండల పార్టీ అద్యక్షుడు రఘునందన్‌రెడ్డి, జడ్పీటీసీ అంజలి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతనకల్ మండలంలో…
నూతనకల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ జక్కి పరమేశ్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, చూడి లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జటంగి గణేశ్ పాల్గొన్నారు.
అర్వపల్లి మండలంలో…
అర్వపల్లి : టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను గురువారం మండల వ్యాప్తంగా నిర్వహించారు.గులాబీజెండాను ఎగురవేసి టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి కొమ్మాల గ్రామంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి ఉపేందర్, బైరబోయిన రామలింగయ్య, కనుకు శ్రీనివాస్, కొప్పుల భరత్‌రెడ్డి, పుప్పాల శేఖర్, గోసుల విజయ్, బందెల అర్వపల్లి, కర్నాటి మురళి, దశరథరామారావు, కుంభం నర్సయ్య, వల్లపు గంగయ్య, కిరణ్ పాల్గొన్నారు.
తుంగతుర్తి మండలంలో…
తుంగతుర్తి : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. తుంగతుర్తిలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బీరపూల నారాయణ, గానుగుబండలో కంచర్ల కుశవలరెడ్డి, తూర్పుగూడెంలో గుండ్ల వెంకన్న, అన్నారంలో మల్లయ్యయాదవ్, బండరామారంలో రమేశ్, వెంపటిలో సత్యనారాయణ, రావులపల్లి ఎక్స్రోడ్తండాలో బబ్బీసింగ్, గ్రామశాఖ అధ్యక్షులు జెండాలు ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, దొంగరి శ్రీను, శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ మండలంలో…
పెన్‌పహాడ్ : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వాడ వాడల టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు గురువారం కనుల పండువగా జరిగాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఆయా కూడళ్లలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, నాయకులు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, మండాది నగేశ్, పరెడ్డి సీతారాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ మండలంలో…
ఆత్మకూర్.ఎస్/చివ్వెంల : ఆయా గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మంత్రి వ్యక్తి గత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి,ఏంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్,జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ మిర్యాల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కాకి కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు. బాలెంల గ్రామంలో జరిగిన జెండా పండుగలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు పాల్గొన్నారు.