ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 4,307
విద్యార్థులు 4,25,951
జూనియర్ కాలేజీలు 244
విద్యార్థులు 58,679యూనివర్సిటీ
పరిధిలో కాలేజీలు 157
విద్యార్థులు 54,790
నేటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన
కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో డే స్కాలర్ టీచింగ్హైకోర్టు ఆదేశాలతో గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లకు బ్రేక్ఆన్లైన్ లేదా ఆఫ్లైన్పై ఇంటర్మీడియట్ కాలేజీలకు వెసులుబాటువర్సిటీ స్థాయిలో ప్రత్యక్ష తరగతులుప్రభుత్వ పాఠశాలలకు చేరిన సన్నబియ్యంప్రతిచోటా కొవిడ్ నిబంధనలు తప్పనిసరి కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు నిశబ్దంగా ఉండిపోయిన బడి గంట మళ్లీ మోగనున్నది. పాఠశాలలతోపాటు అన్ని స్థాయిల్లోని విద్యా సంస్థల్లో బుధవారం ప్రత్యక్ష బోధన ప్రారంభం కానున్నది.
హైకోర్టు ఉత్తర్వులతో రెసిడెన్షియల్,
గురుకులాలను తెరవట్లేదని విద్యా శాఖ స్పష్టం చేసింది. కొద్దిరోజులపాటు వాటిలో ఆన్లైన్ బోధనే కొనసాగనున్నది. పిల్లలను స్కూల్‌కు పంపాలా, వద్దా! అన్నదానిపై ఒత్తిడేమీ లేదని, తల్లిదండ్రులదే నిర్ణయమని ప్రకటించింది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రత్యక్ష లేదా ఆన్లైన్ బోధనకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వగా, హాస్టళ్లకు మాత్రం తాళాలే ఉండనున్నాయి.
యూనివర్సిటీ స్థాయిలో
ప్రత్యక్ష బోధన, హాస్టల్స్ నిర్వహణ యథాతధంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇప్పటికే పరీక్షల కారణంగా వర్సిటీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు అలాగే కొనసాగే వీలుంది. మరోవైపు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించేందుకు మంగళవారం పబ్లిక్ హాలిడే అయినా అధికారులు సన్నబియ్యం సరఫరా చేశారు. ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులు విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని డీఈఓ భిక్షపతి స్పష్టం చేశారు.
రామగిరి, ఆగస్టు 31 : కొవిడ్ కారణంగా సుదీర్ఘకాలం తర్వాత విద్యార్థులు నేటి నుంచి తిరిగి ప్రత్యక్ష తరగతులకు హాజరు కానున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులతో రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలలు తెరవడం లేదు. దీంతో పాటు సంక్షేమ హాస్టళ్లను కూడా తెరుచుకోవడం లేదు. కళాశాలలు కూడా తెరుచుకోనుండగా.. యాజమన్యాల నిర్ణయం మేరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ తరగతులను నిర్వహించే విషయమై ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యక్ష బోధన, హాస్టల్స్ నిర్వహణ యథావిధిగా చేపట్టాలని ఉన్నత విద్యామండలి ఆదేశాల జారీ చేసింది.
అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు
హైకోర్టు ఆదేశాల మేరకు రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలు తప్ప మిగతా పాఠశాలల్లో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. కానీ విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు పంపించాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేశారు. దీంతో అవసరమైతే ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
యూనివర్సిటీలో యథాతధం
యూనివర్సిటీలో మాత్రం ప్రత్యేక్ష తరగతులు, హాస్టల్స్ నిర్వహణ యథావిధిగా జరుగనున్నాయి. మంగళవారం రాత్రి యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో ఉన్నత విద్యామండలి అధికారులు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులంతా తరలిరానున్నారు. ఇప్పటికే పీజీ, బీటెక్‌తో పాటు పలు కోర్సులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా హాస్టల్స్‌ను శానిటైజ్ చేసి కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులను అనుమతించనున్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. మరో వైపు సోమవారం ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రితో జరిగిన సమీక్షలో ఒక రోజు ఆన్లైన్ మరో రోజు ఆఫ్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహణ కొనసాగించాలని కూడా నిర్ణయించారు.
తల్లిదండ్రులపై ఒత్తిడి వద్దు
పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం వెల్లడించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒప్పంద పత్రాలను తీసుకోవద్దని, తల్లిదండ్రులకు ఇష్టమైతేనే బడికి పంపాలని సూచించారు.
ప్రభుత్వ బడులకు చేరిన బియ్యం
జిల్లాలోని 114 క్లస్టర్ పాఠశాలల పరిధిలోని 1430 ప్రభుత్వ పాఠశాలలకు మంగళవారం సెలవు అయినప్పటికీ ఆయా క్లస్టర్స్ సీఆర్పీలు మధ్యాహ్న భోజనం కోసం బియ్యం సరఫరా చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పాఠశాలలకు లారీలు, ఇతర వాహనాల్లో బియ్యం సరఫరా చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో నేటి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది.
గురుకుల విద్యకు బ్రేక్
నల్లగొండ, ఆగష్టు 31 : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టళ్లను కూడా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేశారు. కానీ హైకోర్టు ఉత్తర్వులతో ఈ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో గురుకులాల్లో, సంక్షేమ వసతి గృహాల్లో వసతి పొందే విద్యార్థులు ఇంటి వద్దే ఉండాల్సి వస్తున్నది. ఆయా విద్యార్థులకు ఎప్పటిలాగే ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. జిల్లాలో 140 సంక్షేమ వసతి గృహాలు, 59 గురుకుల పాఠశాలల్లో 60వేల మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి వాటిని తెరిచేందుకు వీలుగా శానిటైజ్ చేశారు. విద్యుత్ సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించింది. సివిల్ సైప్లె అధికారులు సన్న బియ్యాన్ని సైతం సరఫరా చేశారు.
నేటి నుంచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నాం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలలు తెరవడం లేదు. మోడల్ స్కూల్స్, కేజీబీవీలో ప్రత్యక్ష తరగతులు కొనసాగినా హాస్టళ్లు ఉండవు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి. మంగళవారం అన్ని పాఠశాలలకు మధ్యాహ్నం భోజన బియ్యం చేరవేశాం. పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేయవద్దనే ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి.
నల్లగొండ 2080 1,86,982 118 36,376
సూర్యాపేట 1279 1,35,476 78 14,678
మొత్తం 4,307 4,25,951 244 58,679