
తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి లబ్ధి రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు ధీమా
కులవృత్తులకు పెద్దపీట గొర్రెలు, చేప పిల్లల పంపిణీతో కులవృత్తుదారులకు ఉపాధి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి యువతుల పెండ్లికి భరోసా
ఆసరా పింఛన్లతో సామాజిక భద్రత కేసీఆర్ కిట్, అమ్మబడి పథకాల అమలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు పేదింట పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్..
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారులు ఉమ్మడి మెదక్ జిల్లాలో విజయవంతంగా పథకాల అమలు లబ్ధి పొందుతున్న పేదలు
రైతుబంధు, రైతుబీమా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. కేసీఆర్ కిట్, అమ్మఒడి.. గొర్రెల యూనిట్లు, చేప పిల్లల పంపిణీ.. ఆసరా పింఛన్లు.. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ యూనిట్లు.. దళితులకు భూపంపిణీ.. రజకుల లాండ్రీ షాప్‌లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత కరెంట్.. ఇలా చెప్పుకుంటే పోతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టీఆర్ఎస్ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. అన్ని పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. కులం, ప్రాంతం.. పేద, ధనిక..రాజకీయాలకు అతీతంగా.. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నది టీఆర్ఎస్ సర్కారు. టీఆర్ఎస్ పాలనతో ప్రతి కుటుంబం ఏదో రూపంలో లబ్ధి జరుగుతున్నది.
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడి, కులవృత్తులు కనుమరుగై గ్రామాల నుంచి జనం వలసబాట పట్టారు. అప్పట్లో ఆనాటి పాలకులు గ్రామాలపై వివక్ష చూపారు. తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశాయి. ఇప్పుడు పల్లెలు పచ్చని పంటలతో అలరారుతున్నాయి. ఎటుచూసినా జలసవ్వడే. పుష్కలంగా సాగు,తాగునీరు అందుబాటులోకి వచ్చింది. నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతున్నది. ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడులకు రైతులకు రంది లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఇప్పుడు మెతుకు సీమ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తూ ఔరా ధీమాగా బతుకుతున్నారు.
గొర్రెల యూనిట్లు, చేపల పిల్లల పంపిణీతో ఆ కులవృత్తులపై ఆధారపడిన గొల్ల కుర్మలు, మత్స్యకారులు, ముదిరాజ్‌లకు ఉపాధి లభిస్తున్నది. రజకులు, నాయీబ్రాహ్మణుల షాప్‌లకు ఉచిత కరెంట్ సరఫరా భరోసాగా మారింది. సబ్సిడీ రుణాలు, యూనిట్ల మంజూరుతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ధీమాను సర్కారు కల్పిస్తున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నారు. అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్టు సమయంలో పూర్తి చేసి గోదావరి జలాలను ఉమ్మడి మెదక్ జిల్లాకు తీసుకువచ్చారు. పాలకుల సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో చూపించారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తెచ్చారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంతో పాటు ప్రతి రైతుకు జీవిత బీమాను ప్రభు త్వం అమలు చేస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా గోదావరి జలాలను అందించి గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చింది. రోడ్లకు మహర్దశ వచ్చింది. జిల్లాలోని సమీకృత మార్కెట్లు, మోడల్ రైతు బజార్లు రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాయి. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నది. రైతాంగానికి నాణ్యమైన కరెంటును అందిస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తున్నది. ఆసరా పథకంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెద్దన్నగా నిలిచారు. పేదింట యువతుల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంలా మారాయి. ఒకే కుటుంబంలో పలు పథకాలను పొందిన వారు సైతం ఉన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నది.
రైతులకు భరోసా…
సమైక్య రాష్ట్రంలో వలసలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలకు ఉమ్మడి జిల్లా నెలవుగా ఉం డేది. ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరింది. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో గత వానకాలంలో 2.79 లక్షల మందికి రైతుబంధు కింద రూ.305.82 కోట్లను అందించింది. రైతుబీమా పథకం కింద వివిధ కారణాలతో చనిపోయిన 2,487 రైతు కుటుంబాలకు రూ.124.35 కోట్లను అందించింది. రైతులకు రుణమాఫీ కింద రూ.25లోపు ఉన్న 11,054 మంది రైతులకు రూ.16.30 కోట్లను మాఫీ చేసింది. రెండో విడతలో రూ.50 వేలలోపు ఉన్న 27,753 మంది రైతులకు పంట రుణాలు రూ. 94.56 మాఫీ చేసింది.
ఇంటింటికీ తాగునీరు…
సిద్దిపేట జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నది. తాగునీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం నడిచి వెళ్లే బాధలకు విముక్తిని కల్పించింది. గడప గడపకూ తాగునీటిని అం దించడంతో కుళాయి తిప్పగానే ఆ నీటిలో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని మహిళలు చెబుతున్నారు. సిద్దిపేట మానేరు పథకం స్ఫూర్తితో మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిద్దిపేట జిల్లాలో 752 ఆవాసాలకు గాను రూ.1600కోట్లు ఖర్చు చేసి 2,03,370 నల్లా కనెక్షన్లు ఇచ్చి శుద్ధినీరు అందిస్తున్నది.
కుల వృత్తులకు చేయూత…
కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. బలహీన వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించింది. గొర్రెల పంపిణీ పథకంలో సిద్దిపేట జిల్లాలో 32,845 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మొదటి విడతలో 15,462 మంది లబ్ధిదారులకు ఒక యూనిట్‌కు రూ.లక్షా 25 వేల చొప్పున కొనుగోలు చేసి గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతలో యూనిట్ విలువ రూ1.75 లక్షలతో 16,814 మంది లబ్ధ్దిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ ప్రారంభించింది. మత్స్యకారుల అభివృద్ధికి సమీకృత మత్య్స అభివృద్ధి పథకం ప్రవేశపెట్టంది. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదలడమే కాకుండా, సబ్సిడీపై వివిధ పరికరాలను అందించి చేయూతనిచ్చింది. బీసీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా 972 యూనిట్లను మంజూరు చేసింది. ఒక యూనిట్ కాస్ట్ కింద రూ.50 వేలను అందించింది. ఇందుకు గాను రూ.4.86 కోట్లు ఖర్చుచేసింది. ఎస్సీ, ఎస్టీలకు వివిధ పథకాల కింద రుణాలను పెద్దఎత్తున అందించింది. జిల్లాలో 535 చేనేత మగ్గలా ద్వారా కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నది. నేతన్నకు చేయూత పథకం కింద 517 మందిని ఆదుకున్నది.
l ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రేషన్ షాప్‌ల ద్వారా అందిస్తున్నది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి బియాన్ని అందించి ఆహార భద్రత కల్పిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 683 రేషన్ షాపుల ద్వారా 2.94 కుటుంబాలకు ప్రతినెలా 5,814 టన్నుల బియ్యాన్ని అందిస్తున్నది. లాక్డౌన్లో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించింది.
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో 15,734 ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 11,734 ఇండ్లకు పైగా నిర్మాణాలు పూర్తికాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 10 వేల ఇండ్లను లబ్ధ్దిదారులకు అందించారు.
ఆసరా పింఛన్ పథకంతో వృద్ధులు, అభాగ్యులకు పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ నిలిచి వారి గౌరవాన్ని పెంచారు. ఆసరా పథకం కింద జిల్లాలో వృద్ధులు, దివ్యాగుంలు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు అందరూ కలుపుకొని 1,73,244 మంది ఉన్నారు. వీరిక ప్రతినెలా రూ.36.40 కోట్లను ఖర్చుచేస్తున్నది. ప్రతినెలా ఠంచన్‌గా వారి వ్యక్తిగత ఖాతాలో పింఛన్ డబ్బులు జమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం 57 ఏండ్లు ఉన్నవారికి సైతం ఆసరా పథకం వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడంతో మరింత మంది లబ్ధిపొందుతున్నారు.
కేసీఆర్ కిట్ కింద సిద్దిపేట జిల్లాలో 1.18 లక్షల మందికి రూ.36 కోట్లను పంపిణీ చేసింది. 36వేల మందికి కేసీఆర్ కిట్లు అందించింది. జిల్లాలో అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో 102 వాహనాలు 8 ఉన్నాయి. 104 వాహనాలు 16 ఉన్నాయి. 108 వాహనం ద్వారా జిల్లా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.
కల్యాణలక్ష్మి పథకం కింద సిద్దిపేట జిల్లాలో 6,963 మందికి రూ.69.71 సాయం అందించారు. షాదీ ముబారక్ పథకం కింద 368 మందికి గాను రూ.3.68 కోట్లను అందించింది.
మూడు పథకాలు అందుకున్న…
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు పథకాలను ఒకే కుటుంబానికి చెందిన యువతి లబ్ధిపొందింది. కొత్తగా పెండ్లి చేసుకున్న సందర్భంగా 2015లో కల్యాణలక్ష్మితో రూ. 51వెయ్యితో కుటుంబానికి ఆసరా అయ్యింది. 2020లో తొలి సంతానంగా పాప పుట్టడంతో కేసీఆర్ కిట్ అందుకున్న. మూడోసారి 2021 జనవరి 4న రాష్ట్రంలోనే పైలట ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ అమలు చేసిన షీ క్యాబ్స్‌తో మూడు పథకాలు పొందిన. ప్రస్తుతం ఇద్దరు బిడ్డలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాం. జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు సంతోష్‌నగర్ కాలనీలో నివాసముంటున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మూడు రావ డం చాలా సంతోషంగా ఉన్నది. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే.
సీఎం కేసీఆర్ సార్ దేవుడు
సీఎం కేసీఆర్ సార్ దేవుడు. మా అత్త అనారోగ్యంతో చనిపోయిం ది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఊరిలో పనుల్లేక దుబాయ్ వెళ్లా రు. మా మామ కూడా మృతిచెందాడు. మేం ఇద్దరం తోడికోడళ్లం బాగా ఇబ్బంది పడ్డం. మా చేతుల్లో పైసలు లేవు. అప్పులు బాగా అయినయి. సీఎం కేసీఆర్ రైతు బీమాతో అప్పులన్నీ కట్టినం. మా భర్తలు ఇం టపట్టున చేరి కేసీఆర్ సారు రుణం తీర్చుకోలేనిదని ప్రతిరోజూ యాది చేసుకుంటరు.
-కాసు లక్ష్మి కాట్రియాల రామాయంపేట
ఆసరానే ఆదుకుంటుంది..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. తల్లికి వితంతు పింఛన్, మగపిల్లలు (యువకులు) ముగ్గురికి దివ్యాంగుల పింఛన్, భర్త వదిలేసిన ఆడబిడ్డకు ఒంటరి మహిళ పింఛన్ వస్తున్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు. – పటాన్చెరు, అక్టోబర్ 8