
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 09 : ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడారు. చివరి శ్వాస వరకూ ప్రజాసేవకే అంకితమైన కాళోజీ సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమేశ్, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు మేడికాయల వెంకటేశం, డిప్యూటీ సీఈవో, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో..
చివరి శ్వాస వరకూ ప్రజాసేవకై తపించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ అన్నారు. గురువారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారని కలెక్టర్ గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, సిబ్బంది పాల్గొన్నారు
కాళోజీ ఉద్యమ స్ఫూర్తి గొప్పది..
సంగారెడ్డి, సెప్టెంబర్9 : తెలంగాణ సాయుధ పోరాటంలో కాళోజీ నారాయణరావు ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పదని, తెలంగాణ భాషాభివృద్ధికి పాటుపడిన మహోన్నత నాయకుడని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్, సీఈవోలు కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, రవిశంకర్, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, నాగేందర్, రవి, రవీందర్, అశ్విని, నందిని, అజ్రుమాబేగం, సులోచన, నాల్గోతరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, వెంకట్, రాజేశ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తహసీల్ కార్యాలయంలో…
స్థానిక తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ స్వామి ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్దావర్లు నవీన్, నాగార్జుణరెడ్డి, వీఆర్వోలు సంతోష్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను జాగృతం చేసినగొప్ప వ్యక్తి ‘కాళోజీ’
మెదక్, సెప్టెంబర్ 9 : కర్ణాటకలో పుట్టి తెలంగాణలోని వరంగల్‌లో నివాసం ఏర్పర్చుకొని తన రచనలు, సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన గొప్ప రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ అని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సాహిత్యానికి సాహితి సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ అని అన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, డీఈవో రమేశ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కలెక్టరేట్ ఏవో యూసుఫ్, వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
మన భాషను ప్రపంచానికి పరిచయం చేసిన కవి కాళోజీ..
మనోహరాబాద్, సెప్టెంబర్ 9 : మన యాస, మాన భాష అనే నినాదంతో తెలంగాణ భాషను ప్రపంచానికి పరిచయం చేసిన కవి కాళోజీ అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మనోహరాబాద్ ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతిలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతారవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.