
రామాయంపేట, ఆగస్టు 17 : రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, లక్ష్మాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం ఎమెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, దామరచెర్వు సర్పంచ్ శివప్రసాదరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని ఝాన్సీలింగాపూర్‌లో రామాయంపేట మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సారెడ్డి, సర్పంచ్ పంబాల జ్యోతి, టీఆర్ఎస్వీ నాయకులు రవితేజ, రమేశ్ మొక్కలు నాటారు. లక్ష్మాపూర్‌లో సర్పంచ్ భాగ్యమ్మ మొక్కలు నాటారు. అక్కన్నపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి గ్రామంలోని ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సురేశ్‌నాయక్, స్వామి, శ్రీశైలం, వార్డు మెంబర్ రాజు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన హవేళీఘనపూర్‌లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం మెదక్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రక్తదానం చేశారు. ఈ వేడుకలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంద శ్రీహరి, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్, సరిత, యామిరెడ్డి, ఎంపీటీసీలు అర్చన, మంగ్య, సిద్దిరెడ్డి, రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట, ఆగస్టు 17 : మండల పరిధిలోని గవ్వపల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీపై టీఆర్ఎస్ నాయకులు పూలవర్షం కురిపించి ఖడ్గాన్ని బహూకరించి సన్మానించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. వేడుకలో మాజీ సర్పంచ్‌లు పడాల సిద్దిరాములు, మైనంపల్లి రంగారావుతోపాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిజాంపేట, ఆగస్టు 17 : మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పుట్టినరోజు సందర్భంగా నిజాంపేటలో జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ మొక్కలు నాటారు. అనంతరం జడ్పీటీసీ మండల టీఆర్ఎస్ నాయకులతో కలిసి మెదక్ పట్టణంలో సుభాశ్‌రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు జాల పోచయ్య, రాములు, రాజు, లక్ష్మీనర్సింహులు, అబ్దుల్‌పాషా, సిద్ధిరాంరెడ్డి, స్వామి తదితరులు ఉన్నారు.
పాపన్నపేట, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల్లోని వనదుర్గాభవానీ సన్నిధిలో సుభాశ్‌రెడ్డి పేరున ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం మండల కేంద్రమైన పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. వేడుకల్లో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేశ్, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, నాగ్సాన్పల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, బాచారం సర్పంచ్ వెంకట్రాములు, లింగాయపల్లి సర్పంచ్ నవీన్, ఆరేపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యులు గౌస్, ఆర్టీసీ యూనియన్ జిల్లా నాయకులు పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లాపూర్ ఉపసర్పంచ్ అజయ్‌గౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ శ్రీధర్‌తోపాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రభుగౌడ్ పాల్గొన్నారు.