
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 16: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు జహీరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ టీచర్, 56 అంగన్ వాడీ ఆయా, ఒక మినీ అంగన్ వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 2021 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాలు మించకుండా ఉం డాలని స్పష్టం చేశారు. ఎస్సెస్సీ, కుల సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్, అనాథ అయితే సంబంధిత సర్టిఫికెట్, వితంతువు అయి తే భర్త మరణ ధ్రువ పత్రములు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి ఈ నెల 27లోగా వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను అప్లోడ్ చేయాలని, అలా చేయని దరఖాస్తులను తిరస్కరించనున్నట్టు పేర్కొన్నారు. వెబ్సైట్ http:// mis. tswdcw.in లేదా http://wdcw.tg.nic.inలో దరఖాస్తుల కోసం సంప్రదించాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.
సదాశివపేట, ఆగస్టు 16: వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సదాశివపేట సీడీపీవో రేణుక తెలిపారు. సదాశివపేట మండల పరిధిలోని అంకెనపల్లి -2 ఎస్సీ అభ్యర్థి, మద్దికుంట-(టి)-4 ఎస్టీ అభ్యర్థి, ఆరూర్-1 ఓసీ, సూరారం-1 ఓసీ, చందాపూర్-1 బీసీ (డి), నిజాంపూర్-2 ఓసీ, వెంకటపూర్-1 ఓసీ, తంగెడపల్లి టి ఎస్టీ, మాలపహాడ్ ఓసీ, గొల్లగూడెం ఓసీ, ఆత్మకూర్-4 ఓసీ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తామని తెలిపారు. ఏ గ్రామంలో దరఖాస్తు చేస్తే అక్కడే నివాసం ఉండాలని, తప్పనిసరిగా వివాహితులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 18-35 సంవత్సరాలు అర్హులన్నారు. ఇతర సమాచారం కోసం సీడీపీవో రేణుక 9000891458, శ్రీనివాస్ డీఈవో 9989418288 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మునిపల్లి, ఆగస్టు 16 : అంగన్వాడీ టీచర్ , ఆయా పోస్టులకు ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సీడీపీవో రేణుకపాటిట్ తెలిపారు. మునిపల్లిలో సీడీపీవో రేణుకపాటిట్ మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్,ఆయాలకు సంబంధించి ఈ నెల 27లోపు ఆన్లైన్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అంతారంలో అంగన్వాడీ టీచర్ పోస్టు (ఓసీ),మండలంలోని ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు సంబంధించిన వివరాలు తక్కడపల్లి(ఎస్సీ), బోడపల్లి (ఓసీ), కల్లపల్లి-బేలుర్(ఓసీ), గార్లపలి(ఓసీ), మక్తక్యాసారం(ఓసీ), లోనికుర్దు(ఓసీ), హైద్లాపూర్(ఓసీ), మనుసాన్పల్లి(ఎస్సీ), పెద్దచెల్మెడ-1(బిసి-ఎ), బొడిశేట్పల్లి (ఎస్సీ), మల్లికార్జునపల్లి(బిసి-బి), మునిపల్లి-1(ఎస్సీ), లింగంపల్లి-1(ఎస్సీ)లకు సంబంధించిన అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు.
బొల్లారం, ఆగస్టు 16 : మున్సిపల్ పరిధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా ఖాళీగా ఉన్న అంగన్వాడీ సెంటర్లలో కార్యకర్తలు, ఆయా పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు, బొల్లారం కమిషనర్ రాజేంద్రకుమార్ ఒక ప్రకటనలో కోరారు. బొల్లారంలోని 4వ సెంటర్లో కార్యకర్త పోస్టుకు ఓసీ అభ్యర్థులు, 2వ సెంటర్లో ఆయా పోస్టుకు ఎస్సీ అభ్యర్థులు, 3వ సెంటర్లో ఓసీ అభ్యర్థులు, 6వ సెంటర్లో బీసీ-ఈ కేటగిరీలకు అభ్యర్థులు ఆనలైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ఆయా వార్డులకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.