
నిజాంపేట, ఆగస్టు16: గ్రామాల్లో వైకుంఠధామాలను పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మండలంలోని నగరం, నందగోకుల్, నిజాంపేట, చల్మెడ, జడ్చెరువు తండా, బచ్చురాజ్‌పల్లి,రజాక్‌పల్లి గ్రామా ల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలను అదనపు కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్యయంతో పనిచేసి త్వరితగతిన వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. చల్మెడలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనంను జిల్లా అదనపు కలెక్టర్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ నర్సింహారెడ్డి, పంచాయతీ పాలక వర్గం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెం కటలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచు లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ రాజ్ ఏఈ మధు ఉన్నారు.
మనోహరాబాద్, ఆగస్టు 16 : ఉన్నతాధికారులు ఉత్తర్వుల ఇచ్చే వరకు వైకుంఠధామ నిర్మాణ పను లు కొనసాగుతాయని ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..రెవె న్యూ అధికారులు సర్వేనంబర్ 21లో ప్రభు త్వ భూమిని సర్వే చేసి ఆ స్థలాన్ని వైకుంఠధామ నిర్మాణానికి అప్పగించారు. గత నెల ఆ స్థలాన్ని పంచాయతీకి అప్పగించగా ప్రస్తుతం వైకుంఠధామం నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు ఆ స్థలం తమ పట్టా భూమి అని ఆరోపిస్తున్నారు. వైకుంఠధామ పనులను సోమవారం పరిశీలించామన్నారు. రెవెన్యూ అధికారులు చూపిన సర్వే నంబర్ 21 ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నారని, అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వస్తే పనులను నిలిపివేస్తామన్నారు.