
నారాయణఖేడ్, ఆగస్టు 15 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగల్గిద్ద మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతానే నియోజకవర్గంలో ఊహించని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా గౌడ్గావ్ జనవాడకు చెందిన హన్మంత్‌రావు, బాబు, శిఖార్ఖానకు చెందిన విజయ్‌కుమార్, నాగల్‌గిద్దకు చెందిన కల్యాణ్‌రావు తదితరులకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు నాగ్‌శెట్టి, దిగంబర్, దత్తు, గుణవంత్‌రావు, సదానంద్ పాల్గొన్నారు.