
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేడుకల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంది. సంగారెడ్డిలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఆవిష్కరించనున్నారు. వేడుకల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు, ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విశిష్ట సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేకంగా షామీయానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ముఖ్య జెండావిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానిస్తారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలపై శకటాల ప్రదర్శనను తిలకించి స్టాళ్లను పరిశీలించనున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 14 : పంద్రాగస్టు వేడుకలకు సంగారెడ్డి పరేడ్ మైదానం ముస్తాబైంది. డీఎస్పీ బాలాజీతో కలిసి పరెడ్ మైదానం ఏర్పాట్లను ఎస్పీ రమణకుమార్ పరిశీలించారు. డాగ్ స్కాడ్ బృందాలతో మైదానంలో తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది మైదానంలో రంగవళ్లులతో తీర్చిదిద్దారు. శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకావిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 10.50 నుంచి 11.10 గంటల వరకు జిల్లా
ప్రజలనుద్దేశించి సందేశం ఇస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం, ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాళ్ల సందర్శన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా విజేతలు ఖరారయ్యారు. జిల్లాలో మొత్తం నాలుగు ఇన్నోవేషన్స్ ఎంపిక చేయగా, వారు ఆదివారం జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఆయా ఇన్నోవేషన్స్‌ను ప్రదర్శించనున్నారు. భూమిని శుభ్రపరచడానికి, సమం చేయడానికి రాక్ పెకర్ యంత్రం తయారు చేసిన దీపక్‌రెడ్డి మొదటి స్థానంలో నిలవగా, దశల ద్వారా ధరించగలిగే బ్యాగ్, స్లయిడర్గా ఉపయోగించడం బహుళార్థసాధక బరువు హోల్డర్ తయారు చేసిన నితిన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడో స్థానంలో వీ సౌజన్య తయారు చేసిన కనురెప్పల కదలికను విశ్లేషించడానికి పరికరం, మగతని గుర్తించడానికి ఆవలింతలు ఇన్నేవేషన్, నాల్గో స్థానంలో ప్రతాప్ తయారు చేసిన అనుకూలీకరించదగిన మల్టీక్రాప్ సీడ్, ఎరువుల డ్రిల్లర్ ఇన్నోవేషన్స్ ఎంపికయ్యాయి.
సిద్దిపేట, ఆగస్టు 14 : సిద్దిపేటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కరోనా నేపథ్యంలో సాధారణంగానే వేడుకలు జరగనున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీశ్‌రావు ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండావందనం చేస్తారు. 10.45 నుంచి 11.45 వరకు జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతారు. 11.15 నుంచి 11.30 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తారు. 11.30 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం డిగ్రీ కళాశాల మైదానంలో అధికారులు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 14 : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టరేట్ ఆవరణలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు పనులను అధికారులు పర్యవేక్షించారు. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ హేమలతగౌడ్, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి తదితరులు హాజరు కానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
నూలు వస్త్రంతో తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి. జెండా ఎగురవేసే సమయంలో వేగంగా ఎక్కించాలి. జాతీయ జెండా ఎగురవేసే సమయంలో అందరూ జెండా వైపు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించాలి.
జాతీయ పతాకంలో కాషాయం రంగు పైకి ఉండేలా చూడాలి. తలకిందులుగా ఎగురవేస్తే నేరంగా పరిగణిస్తారు.
జెండా కర్ర, ఇనుప పైపునకు చివరగా జెండా ఎగిరేలా చూడాలి.
జాతీయ జెండా సమీపంలో ఇతర జెండాలు ఎగురవేయరాదు. అన్నీ జెండాల కంటే జాతీయ జెండా ఎత్తులో ఉండాలి.
జాతీయ పతాకంలో రంగులు వెలిసి పోయినా, ముడతలు ఉన్నా జెండాను ఎగురవేయరాదు.
జెండా ఎగురవేసే సమయంలో జెండా నేలకు తాకకుండా జాగ్రత్తలు వహించాలి. జెండా నేలకు తాకితే నేరమే.
జెండా ఎగురవేసే సమయంలో స్వచ్ఛ పూలు మాత్రమే ఉంచాలి. అందులో ప్లాస్టిక్ పూలు, ఇతర వస్తువులను ఉంచి