
ఇంటర్ పుస్తకంలో సంగారెడ్డి జిల్లా పాఠ్యాంశం
సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ మ్యాన్ కైండ్ పేరిట పాఠం
ఇంటర్ పాఠ్య పుస్తకంలో సంగారెడ్డి జిల్లా అంశం
ఇంటర్ మొదటి సంవత్సర ఇంగ్లిష్ మీడియం పుస్తకంలో ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పాఠ్యాంశం
సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ మ్యాన్ కైండ్ పేరిట పాఠం
ఆదర్శంగా మారిన హరిదాస్పూర్, ఎద్దుమైలారం గ్రామాలు
ఏదైనా మంచి పనిచేస్తే ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం సహజమే. కానీ, ఆ చేసే మంచిపని కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులను కదిలించేలా ఉంటే అది గొప్ప విషయమై ఉంటుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగిన ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఏకంగా పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో అధికారికంగా ప్రచురించారంటే అది ఎంతటి మహత్కార్యమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడబిడ్డల సంరక్షణకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో తలపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇంటర్ మొదటి సంవత్సరం ఆంగ్ల (ఇంగ్లిష్) పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించింది…