
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్, ఆగస్టు 13: యువకులు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం గునుకులకుంట గ్రామానికి చెందిన నీరుడి నర్సింహులుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చెరుకు బండి నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూ పాల్‌రెడ్డి నర్సింహులుకు అందజేశారు. యువకులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. కార్పొరేషన్ రుణాలకు సంబంధించి గతంలో ఉన్న మార్గదర్శకాలను కేసీఆర్ ప్రభుత్వం సవరిస్తూ రుణాలకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులకు అందజేసే విధానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజునాయక్ ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 13 మందికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలను ఆదుకునే ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజ లకు సూచించారు.