
విఘ్నాధిపతి వినాయకుడి పూజకు వేళయ్యింది. చిన్నాపెద్దా సంబురంగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక నవరాత్రులు ప్రముఖమైనవి. గణపయ్యను పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ వైరస్ ఎందరినో పొట్టనబెట్టుకుని అనేక కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చింది. కరోనాతో మానవ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై మనిషికి ఆసక్తి, జాగ్రత్తను పెంచింది. ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టాలు,నష్టాలను దిగమించి ఆశావాహ దృక్పథంతో బతుకు పోరులో మనిషి ముందుకు సాగుతున్నాడు. ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్తేనే భవిష్యత్ ఉంటుందని ఏడాదిన్నర కాలంగా పరిస్థితులు మనిషికి తెలియజేస్తున్నాయి. కరోనా తర్వాత పర్యావరణ స్పృహ పెరిగింది. ప్రకృతిని దెబ్బతీస్తే విపత్తులు, ఉపద్రవాలు తప్పవని మనిషి గుర్తెరిగాడు. ఇకపోతే కరోనా మహమ్మారి నియంత్రణకు సర్కారు విశేషంగా కృషిచేస్తున్నది. థర్డ్‌వేవ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నది. కరోనా-లాక్డౌన్ సమయంలో ఉచితంగా బియ్యం, నగదు సాయం చేసి పేదలు, అన్నివర్గాలకు అండగా నిలిచింది. వలస కార్మికులు, రైతులు, అన్నివర్గాలను అక్కున చేర్చుకున్నది. ప్రజలు గతేడాది ఇంట్లోనే వినాయక చవితి పండుగను నిర్వహించుకోగా, ఈసారి కొవిడ్ నిబంధనలతో సామూహికంగా నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు. వినాయకుడు కరోనా విపత్తును పూర్తిగా తొలగిస్తాడని, సర్వశుభాలు చేకూరుస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కరోనా అంటే తెలియని వారుండరేమో.. దాదాపు ఏడాదిన్నరగా ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ ఎందరినో పొట్టనబెట్టుకుని ఎన్నో కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చింది. కరోనాతో మానవ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై మనిషికి ఆసక్తి, జాగ్రత్తను పెంచింది.
లాక్‌డౌన్‌తో…
కరోనా-లాక్‌డౌన్‌తో జనం నెలల తరబడి ఇంటికే పరిమితమయ్యారు. తద్వారా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిని అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటున్నది. కష్టాలు, నష్టాలను దిగమించి ఆశావాహ దృక్పథంతో బతుకు పోరులో మనిషి ముందుకు సాగుతున్నాడు..
గతేడాది ఉత్సవాలు నిర్వహించుకోలేక..
కరోనాతో గతేడాది సామూహికంగా వినాయక ఉత్సవాలు నిర్వహించుకోలేదు. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి అనేక సవాళ్ల మధ్య ఆ విఘ్నాధిపతిని కొలువడానికి సమయం ఆసన్నమైంది. ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్తేనే భవిష్యత్తు ఉం టుందని ఏడాదిన్నర కాలంగా పరిస్థితులు మనిషికి తెలియజేస్తున్నాయి.
పెరిగిన పర్యావరణ పరిరక్షణ స్పృహ..
కరోనాలాంటి మహమ్మారి పుట్టడానికి పర్యావరణ విఘాతమే కారణమని నమ్మేవారు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని కొన్నేండ్లు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషితో పర్యావరణ హిత మట్టిగణపతుల వాడకం పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో ఇదొక ముందడుగా చెప్పవచ్చు. ప్రకృతిని దెబ్బతీస్తే ఇలాంటి విపత్తులు, ఉపద్రవాలు తప్పవని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేస్తున్నారు.
అండగా నిలిచి.. ఆదుకున్న సర్కారు..
ఇక పోతే కరోనా కట్టడిలో దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసి, దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తూ మహమ్మారి నుంచి ప్రజలను రక్షిస్తున్నది. కరోనా-లాక్డౌన్ సమయంలో ఉచితంగా బియ్యం, నగదు సాయం చేసి ప్రభుత్వం పేదలు, అన్నివర్గాలకు అండగా నిలిచింది. వలస కార్మికులు, రైతులు, అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నది. విపత్తు ల సమయంలో ప్రజలకు ప్రభుత్వాలు, పాలకుల సాయం, భరోసా ఎంతైనా అవసరం. దానిని తెలంగాణ సర్కారు వందశాతం నిజం చేసింది.
మనిషి జీవితంలో అనేక మార్పులు..
ఏడాదిన్నర కాలంగా కరోనాతో ఇబ్బంది పడని మనిషి అంటూ లేడు. కరోనా-లాక్డౌన్ మనిషిలో అనేక మార్పులకు బీజం వేసిం ది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ఆరోగ్య, వ్యక్తిగత బీమా తీసుకోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటి ప్రాధాన్యతను తెలియజేశాయి. వీటన్నింటికి మనిషి ఇప్పుడు ప్రాధాన్యతిస్తున్నాడు.
విఘ్నాలు తొలగి..
ఈ వినాయక చవితి నుంచి అయినా అన్ని విఘ్నాలు తొలగి సర్వజీవులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశపడుదాం.. ఆ వినాయకుడిని మనసారా కోరుకుందాం..!! కొవిడ్ నిబంధనలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిద్దాం..!
థర్డ్‌వేవ్ నేపథ్యంలో..
కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ముమ్మరం చేసింది. ప్రజలందరికీ వందశాతం టీకా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రెండేళ్లుగా ప్రభుత్వం కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో సమూలమైన మార్పులు తీసుకురాడటంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చింది. కరోనా పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించి వారు కోలుకునేలా చేసింది. ఇంటింటి సర్వేతో కరోనాను కట్టడి చేసింది. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఆరోగ్యదాయకం…
గణపతి పండుగ పూజలో ఔషధ, ఆయుర్వేద ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గణపతికి 21 రకాలైన పత్రాలతో భక్తులు పూజిస్తారు. 21 పత్రాలు అన్ని సేకరించి గణపతిని పూజించడంతో వాటి ద్వారా ఆరోగ్యం, మానిసకోల్లాసం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇదిలా ఉంటే విద్యార్థులు తమకు విజయాలు ప్రసాధించాలని గణనాయకుడిని మొక్కుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం పాఠశాలలు, విద్యా సంస్థల్లో తరగతులను ప్రారంభించింది. ఈ విద్యాసంవత్సరంలో విద్యాభ్యాసం సజావుగా సాగించి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులు గణపతిని కోరుకుంటున్నారు.