
చేపల పెంపకంతో మత్స్యకారులకు పుష్కల ఉపాధి
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి,
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
కల్హేర్, సెప్టెంబర్ 8: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నదని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి 11.14 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను నిర్లక్ష్యం చేశారన్నారు. టీఆర్ఎస్ సర్కారు అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల బతుకులను బాగుచేయడానికి సీఎం కేసీఆర్ నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నారన్నారు. అలాగే, రైతులు, మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లవాగు ప్రాజెక్టు 365 రోజులు నిండు కుండలా ఉంచేందుకు లిప్ట్ ఇరిగేషన్ ద్వారా సింగూరు నీటిని తరలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, సిర్గాపూర్, కల్హేర్ జడ్పీటీసీలు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీపీ మైపాల్‌రెడ్డి, మత్స్యశాఖ ఏడీఏ సతీష్, పర్యవేక్షణ అధికారి అబ్దుల్ రషీద్, గ్రామ సర్పంచ్ గంగామణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంజీవ్‌రావు, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలందర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.