మెహిదీపట్నం:చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢమాసం బోనాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారని ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్ అన్నారు. గురువారం గోల్కొండ బోనాల కులవృత్తుల సంఘం సభ్యులకు గోవిందరాజ్,ఆలయ ఈవో ఎస్.మహేందర్‌కుమార్ ఫ్రభుత్వం తరపున జీతభత్యాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కులవృత్తుల సంఘం అధ్యక్షులు సాయిబాబాచారి, ప్రతినిధుల శివశంకర్,శ్రీకాంత్ చారి,సురేష్‌చారి,ప్రసాద్,నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.