Revant reddy | జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్..ఉద్రిక్తత

బంజారాహిల్స్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయలుదేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం 46లోని రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రవెల్లికి వెళ్లేందుకు రావాలంటూ రేవంత్ కోరడంతో భారీగా కార్యకర్తలు జూబ్లీహిల్స్‌కు వచ్చారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వెస్ట్‌జోన్ ఇన్చార్జి డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌తో పాటు ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మొహరించారు.
కావాలంటే గాంధీభవన్‌కు వెళ్లడానికి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినా పట్టించుకోని రేవంత్‌రెడ్డి భారీగా వచ్చిన కార్యకర్తలతో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చారు. తాను ఎలాగైనా గజ్వేల్ వెళ్తానంటూ కార్యకర్తలతో కలిసి ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అప్రమత్తమయి రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

