సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
బషీరాబాద్, ఆగస్టు 22 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో పర్యంటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కలుపు మొక్కల నివారణకు మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తుల భాగాస్వామ్యం చాలా ముఖ్యమన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పారిశుధ్య నిర్వహణలో గ్రామస్తుల్లో చైతన్యం వచ్చిందన్నారు. అనంతరం జలాల్పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుర్వ గోవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమర్‌ప్రసాద్ మృతిచెందగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, రాజారత్నం, నర్సిరెడ్డి, గోపాల్ అడ్వకేట్, రామునాయక్, రజాక్, ముణిందర్రెడ్డి, రంగారెడ్డి, నరేశ్చవాన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్ పేదలకు భరోసా
పెద్దేముల్, ఆగష్టు 22 : పేదల కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ భరోసాను ఇస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన బెంజిమన్‌కు రూ.2 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్ కుమార్‌తో కలిసి తాండూరు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, రుద్రారం గోపాల్‌రెడ్డి ఉన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
బషీరాబాద్, ఆగస్టు 22 : ప్రతి ఒక్కరూ సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముజ్తబా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవ కార్యక్రమాలకు నావంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, పార్టీ నాయకులు శ్రీశైల్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అబ్ధుల్ ఆహాద్, ముస్తఫా, హామీద్, జునైద్, తహెర్, ఖదీర్, ఇబ్రహీం పాల్గొన్నారు.
నేటి నుంచి గల్లీగల్లీకి పైలెట్ కార్యక్రమం
తాండూరు, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తాండూరు మున్సిపల్లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం నుంచి 36 వార్డుల్లో పర్యటించేందుకు ‘గల్లీ గల్లీకి పైలెట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదివారం విలేకరులతో పేర్కొన్నారు. రోజూ 6 వార్డుల్లో పర్యటన చేయనున్నట్లు తెలిపారు. 23, 24, 25 తేదీల్లో 18 వార్డులు, 30, 31, 1వ తేదీ మరో 18 వార్డుల్లో పర్యటనకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.