రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు షాద్‌నగర్‌లో సుమారు 3 వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
షాద్‌నగర్‌టౌన్ ఆగస్టు 21: హెల్మెట్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తుందని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, షాద్‌నగర్ ఏసీపీ కుశల్కర్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని మినీ స్టేడియంలో శనివారం షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు రైడ్ సేఫ్.. రీడ్ సేఫ్ బైకు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడుపకూడదన్నారు. మీ ప్రాణాల కోసమే పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అతివేగం కన్నా ప్రాణాలే మిన్న అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడుపాలని సూచించారు. ఎక్కడా లేని విధంగా యూనియన్లను ఏకతాటిపై తీసుకొచ్చి సుమారు 3 వేల వాహనాలతో భారీ బైకు ర్యాలీ నిర్వహించిన ఎస్ఐ రఘుకుమార్‌ను ప్రత్యేకం గా అభినందించారు. అంతకు ముందు ర్యాలీకి హాజరైన ఏసీపీ ఎస్ఐ రఘుకుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగ తం పలికారు. హెల్మెట్‌ను ధరించి భారీ ర్యాలీ పట్టణంలో నిర్వహించడంతో తెలంగాణ బుక్ఆఫ్ రికార్డు రాష్ట్ర అవార్డును ఎస్ఐ రఘుకుమార్ కైవసం చేసుకున్నారు. ఈ అవార్డును శంషాబాద్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ కుశల్కర్, చైర్మన్, ఫౌండర్ వెంకటాచారి, కళాకారులు బిత్తిరి సత్తి, కొమరం, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ లావణ్య అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
అలరించిన ప్రముఖ కళాకారులు బిత్తిరిసత్తి, కొమరం
రైడ్ సేఫ్ రీడ్ సేఫ్ బైకు ర్యాలీ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు బిత్తిరి సత్తి, కొమరం తమ మాటలతో అలరించారు. హెల్మెట్ అంటే లైఫ్ అనే విషయాన్ని అందరూ గ్రహి ంచాలన్నారు. పలువురు చిన్నారులు రోడ్డు ప్రమాదాలపై కంటి కి కట్టినట్టుగా చేసిన నృత్యాలు పలువురిని అలోచింపజేశాయి. కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చలి నర్సింహ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, సలేంద్రం రాజేశ్వ ర్, నాయకులు శంకర్, యుగేందర్, కిషోర్, జమృత్‌ఖాన్, శేఖ ర్, యాదగిరి, నాయకులు, పోలీసులు పాల్గొన్నారు.