చేవెళ్ల టౌన్, అక్టోబర్ 20 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇబ్రహీంపల్లి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. విషపురుగులతో సతమతమైన ప్రజలు పాడుబడిన ఇండ్లను నేలమట్టం చేయడంతో తేరుకున్నారు. ప్రతీ రోజు ఇండ్ల వద్ద నుంచి తడి, పొడి చెత్తను ట్రాక్టర్‌తో తరలించి ఎరువు తయారీ కేంద్రానికి తరలిస్తున్నారు. ట్యాంకుల ద్వారా పలు ప్రాంతాల్లో నాటిన మొక్కలకు, నర్సరీల్లో నీటిని పోస్తున్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. రాత్రి పూట విద్యుత్ దీపాలతో గ్రామం మెరిసిపోతున్నది. మొత్తంగా ఇబ్రహీంపల్లి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నది.
గ్రామాభివృద్ధే ధ్యేయం : మంజుల, సర్పంచ్
గ్రామాభివృద్ధే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులు చేపట్టాం. తడి, పొడి చెత్తను ఎరువు తయారీ కేంద్రానికి తరలిస్తున్నాం. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. పల్లెను పరిశుభ్రంగా మార్చుతాం.
ప్రజల సహకారంతోనే పనులు పూర్తి
ప్రజల సహకారంతో గ్రామంలోని పనులు పూర్తవుతున్నాయి. గ్రామంలో పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణకై చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఊరంతా పరిశుభ్రంగా మారింది. సమస్యలు సైతం తొలగిపోయాయి.
విష్ణుప్రియ, పంచాయతీ కార్యదర్శి