గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్,
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, ఆగస్టు 18 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గిరిజనులు తీజ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ సంస్కృతిలో తీజ్ ఉత్సవం భాగమని, మన సంస్కృతి సంప్రదాయలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. గిరిజనుల తీజ్ పండుగకు చాలా ప్రాధాన్యత వున్నదని, తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు ఎంతో కఠినంగా దీక్ష చేపడతారని పేర్కొన్నారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా తండాకు చెందిన యువతులు ఎంతో నియమ నిష్టలతో మొలకల బుట్టలను తయారుచేశారు. గిరిజన యువతులు బుట్టలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తండాలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన మొలకల బుట్టల పందిరి వద్ద యువతి, యువకులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం మొలకలను స్థానిక చెరువులో నిమజ్జనం చేయడానికి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మైసిగండి ఆలయ ట్రస్టీ శిరోలీ, సర్పంచులు తులసీరాంనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, హరిచంద్‌నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్‌లు రాజారాం, రామకృష్ణ, నాయకులు భాస్కర్‌నాయక్, నరేశ్‌నాయక్, పాండునాయక్, హర్యానాయక్, దూద్యానాయక్, అరుణ్‌నాయక్, అమర్‌సింగ్, లక్ష్మణ్, కిషన్, హీరానాయక్, రెడ్యానాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు.