మొయినాబాద్, ఆగస్టు 17 : మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు ఏర్పాటు చేసిన గొడుగులను ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ తో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. అనంతరం నీలి రంగు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అనేక అవరోదాలు దాటి రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై అధ్యాయనం చేశారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామన్నారు. బడుగుబలహీన వర్గాల ప్రజలకు సేవలందించిన మహానీయుడు జగ్జీవన్‌రామ్ అని ఎమ్మెల్యే అన్నారు. యువత మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహానీయుల విగ్రహాల నీడ కోసం గొడుగులను ఏర్పాటు చేసిన దాత ముదిగొండ మహేందర్యాదవ్ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, మండలాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, జిల్లా నాయకుడు రవీయాదవ్, మండల నాయకుడు రాఘవేందర్‌యాదవ్, మండల కార్యదర్శి పరమేశ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుమన్, టీఆర్ఎస్ మండల నాయకుడు దర్గ రాజు పాల్గొన్నారు.