విలేజ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అత్యధికంగా జిల్లాలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. గ్రామీణ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసి, సుస్థిరమైన జీవనోపాధి పొందేలా ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఎస్‌హెచ్‌జీ సభ్యులు 3,313 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 2,544 మంది సభ్యులు వ్యాపారులుగా మారారు. వీరికి రూ.24.36 కోట్ల రుణాలు అందజేశారు. జిల్లాలో 76.79 శాతం మేర స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని, ఉపాధి పొందుతున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. రాష్ట్రంలోనే అత్యధికం గా జిల్లాలో గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. రెండు, మూడు స్థానాల్లో సిద్దిపేట, నల్లగొండ జిల్లాలుండగా, నాలుగో స్థానంలో మెదక్ జిల్లా నిలిచింది. అయితే గ్రామీణ మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విలేజ్ ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ప్ర క్రియ జిల్లాలో వేగవంతమైనది. జిల్లాలో ఎంపిక చేసిన సంఘాల సభ్యుల్లో 76.79 శాతం మేర స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే విలేజ్ ఎం టర్ప్రైజెస్లో భాగంగా గ్రామస్థాయిలోనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను ప్రా రంభించారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా ప్రభుత్వమే మంజూరు చేస్తున్నది. అయితే జిల్లాలోని సభ్యులకు రుణాల మంజూరుకుగాను ప్రభుత్వం రూ. 35కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.
వ్యాపారులుగా మారిన 2,544 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు
జిల్లాలోని ప్రతి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లోని ఆసక్తిగల వారిలో ముగ్గురి చొప్పున ఎంపిక చేసి, వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్త, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి పొందేలా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు 2,544 మంది స్వ యం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారు లుగా మారారు. వీరిలో ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలను 183మంది, వాణిజ్య, వర్తక వ్యాపారాలకు సంబంధించి 1,148మంది, సేవాపరమైన వ్యాపారాలను 1,213మంది ప్రారంభిం చారు. సంబంధిత 2,544 మంది వ్యాపారాలను నిర్వహించుకునేందుకుగా ను బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధు ల ద్వారా రూ.24. 36 కోట్ల రుణాలను అందజేశారు. విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగంగా ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారం చేసేందుకుగాను ఒక్కొ సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. అయితే జిల్లాలో విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగంగా 3,313 ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేయగా ఇప్పటివరకు 2,544 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ప్రా రంభించగా, మిగతా 769 మంది ఈ నెలాఖరులోగా ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారం మొదలుపెట్టారు. అయితే వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు నష్టపోకుండా వారు ఎంచుకు న్న వ్యాపారాలకు సంబంధించి వ్యాపార మెలకువలు, నైపుణ్యాన్ని కూడా సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణ ఇప్పించారు. అదేవిధంగా ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం చేయకుండా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు నిర్ణయించిన విధంగానే వ్యాపారాలను ప్రారంభించారు. అయితే జిల్లాలో విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగంగా ఉత్పత్తులు, ట్రేడింగ్, సేవల రంగాలకు సంబంధించి జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో 181 రకాల వ్యాపారాలను జిల్లాలోని మహిళా స్వయం సహాయక సభ్యులు చేసేందుకు నిర్ణయించారు. అయి తే ఉత్పత్తి రంగంలో పేపర్ ప్లేట్లు, బేకరీ, ఇటుకల తయారీ, విస్తరాకుల తయారు యంత్రం, స్నాక్స్ యూనిట్, బాస్కెట్ తయారు, రోటి తయారు, స్టేషనరీ, ప్లోర్ క్లీనర్, రైస్‌మిల్, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారాలు, అదేవిధంగా ట్రేడింగ్ రం గంలో కిరాణా దుకాణం, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డైరీ, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, ఫెర్టిలైజర్ దుకాణం, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాప్ వ్యాపారాలు, సర్వీసు రంగంలో హోటల్, టిఫిన్ సెంట ర్, టైలరింగ్, మటన్, చికెన్ షాప్, పిండి గిర్ని, వాటర్ ప్లాంట్, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్, మొబైల్ ఫోన్ మెకానిక్, మెడికల్ షాప్, టెంట్ సైప్లె సర్వీసు, వెల్డింగ్ షాప్, కెమెరా, ఫొటో స్టూడి యో తదితర వ్యాపారాలను జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మొదలుపెట్టారు. మరోవైపు జిల్లాలో 21 గ్రామీణ మండలాలు, 585 గ్రామ పంచాయతీలు, 753 గ్రామసంఘాలు, 20,294 స్వయం సహాయక సంఘాలుండగా 2.25 లక్షల మంది సభ్యులున్నారు.