మిషన్ భగీరథతో తీరిన తాగునీటి కష్టాలు
గ్రామానికి వరంగా మారిన ‘పల్లె ప్రగతి’
చేవెళ్ల టౌన్, సెప్టెంబర్12: మండలంలోని రామన్నగూడ గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మించారు. పల్లె ప్రకృతి వనంతోపాటు హరితహారం నర్సరీ ఏర్పాటుచేశారు. గ్రామంలోని ఖాళీ స్థలాల్లో, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రామన్నగూడ గ్రామం రూపురేఖలు మారాయి. కొన్నేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడం, పాడుబడ్డ బావులు పూడ్చేయడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. రోజూ పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.
ఆహ్లాదకరంగా అభివృద్ధి
గ్రామంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మిషన్ భగీరథతో సరిపడా తాగునీటిని నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. గ్రామంలో నిత్యం పారిశుధ్య పనులను చేపడుతున్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పంచాయతీకి అనుసంధానం చేసి గ్రామంలో ఎక్కడ ఏమీ జరగకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
రామన్నగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. పేరుకుపోయిన సమస్యలు తొలిగిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాం. ప్రతి వీధిలో లైట్లు ఏర్పాటుచేశాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రామస్తుల సహకారంతో ముందుకెళ్తాం.
సమస్యలు తొలిగిపోయాయి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాం. పంచాయతీ సిబ్బం ది ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
పల్లె ప్రగతితో సమస్యలు దూరం
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిం ది. దీంతో సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామం అభివృద్ధిలో జిగేల్ మంటున్నది. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదంగా ఉంది.