వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలు అందజేత
ఆర్థిక చేయూతతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
రూ.89 కోట్లతో 30వేల చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల విడుదల
రూ.25కోట్లతో 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలు
ఐదేండ్లలో రూ.208 కోట్ల నిధులతో రూ.30 వేల కోట్ల ఆదాయం
జిల్లాలో 447 మందికి రూ.40లక్షల రుణాలు ఇచ్చాం
మంత్రి సబితాఇంద్రారెడ్డి
కోట్‌పల్లి ప్రాజెక్టులో ఐదో విడుత చేప పిల్లల విడుదల
త్వరలో టూరిజం బోట్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
‘మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో మంచి రోజులొచ్చాయి.. ఆర్థిక చేయూతనందిస్తూ వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్నాం… ఇప్పటికే వాహనాలను అందించాం.. చేపలతో లాభాలను ఆర్జించడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కోట్‌పల్లి ప్రాజెక్టులో జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్, కాలె యాదయ్యలతో కలిసి ఐదో విడుత చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.89 కోట్ల నిధులతో 30 వేల చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదలనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేశామన్నారు. కోట్‌పల్లిలో త్వరలోనే టూరిజం బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేండ్లుగా రూ.208 కోట్ల నిధులతో 30 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లాలో 447 మందికి రూ.40లక్షల రుణాలు ఇచ్చామని తెలిపారు.
కోట్‌పల్లి/ధారూర్, సెప్టెంబర్ 8 : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కోట్‌పల్లి ప్రాజెక్టులో 5వ విడుత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని మంత్రి, చైర్పర్సన్ హాజరై మత్స్యశాఖ అధ్యక్షుడు ఆనంద్, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్, యాదయ్య, కలెక్టర్ నిఖిలతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్‌పల్లి ప్రాజెక్టులో మరో 9 లక్షల చేపపిల్లలను విడుతలవారీగా విడుదల చేస్తామన్నారు. 25 లక్షల పెద్ద సైజు, 14 లక్షల చిన్న సైజు చేప పిల్లలను జిల్లాలో ఉన్న 775 చెరువుల్లో వదులుతామని చెప్పారు. గతేడాది జిల్లాలో ఉన్న 775 చెరువుల్లో రూ.8కోట్ల61లక్షల విలువచేసే చేపపిల్లలు, 93 నీటి వనరుల్లో 4 కోట్ల రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు. కోట్‌పల్లిలో త్వరలోనే టూరిజం బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 447 మందికి రూ.40లక్షల రుణాలిచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని 105 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4429 మంది సభ్యులున్నారని తెలిపారు. చెరువుల్లో వంద శాతం రాయితీపై చేపపిల్లలను వదులుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
మత్స్యకారుల ఆర్థిక సంపద పెరిగింది
మత్స్యకారులకు అండ
మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు
చేప పిల్లలతో జీవనోపాధి