పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయండి
కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు
ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా గురువారం పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్‌తో కలిసి ఆయన ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రావు, జగదీశ్‌యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమేశ్‌గౌడ్, రమేష్, చక్రవర్తితో పాటు గడ్డిఅన్నారం మున్సిపల్ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జెర్కోని రాజు, మైలారం విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, కాజు, గోపాల్, మహేష్, వీరేష్, భగీరథ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా జెండా పండుగ..
టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని గురువారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు జెండాలను ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా జెండా పండుగను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో జెండాలను ఎగురవేశారు.
60 లక్షలు సభ్యత్వం ఉన్న పార్టీ
ఆమనగల్లు, సెప్టెంబర్ 2 : ఆమనగల్లు పట్టణంతో పాటు పంచాయతీల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఆమనగల్లు పట్టణంతో పాటు సాకిబండతండాలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని గుర్తుచేశారు. దేశంలో 60 లక్షలు పార్టీ సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని, దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీసు నిర్మించడం గొప్ప విషయమన్నారు.
టీఆర్ఎస్ పటిష్టతకు ప్రాధాన్యం
కొత్తూరు, సెప్టెంబర్ 2 : గ్రామాల వారీగా టీఆర్ఎస్ పటిష్టతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు సౌత్ ఇండియా బ్యాంకు వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి జెండా ఎగుర వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు.
పల్లె పల్లెన గులాబీ జెండా
షాద్‌నగర్, సెప్టెంబర్ 2 : పల్లె పల్లెన గులాబీ జెండా ఎగిరింది. జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దేశ రాజదాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. పట్టణం, వెల్జర్ల గ్రామంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గులాబీ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం, రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పనితీరును కొనియాడారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు
ప్రభుత్వాని విమర్శిస్తే సహించేది లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీజేపీ నాయకులను హెచ్చరించారు. టీఆర్ఎస్ జెండా పండుగా సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పక్క పాదయాత్ర చేస్తు గ్యాసు ధర తగ్గిందని చెపుతూనే మరో పక్క రూ.25 పెంచడం సిగ్గుచేటన్నారు. పెట్రోలు, డీజీల్ ధరలు పెంచుతూ మాట్లాడడానికి బీజేపీ నేతలకు సిగ్గు ఉండాలన్నారు.