మణికొండ: రాజేంద్రనగర్ హైదర్‌గూడ సిరిమల్లెకాలనీలోని ఫ్లైయింగ్ గ్రావిటి అకాడమీలో ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంజులా, సునీత, అరుణ్, ఎక్బాల్, సుభాష్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, కరుణాకర్,బాలు, రాము పాల్గొన్నారు.