ఖలీల్‌వాడి/నందిపేట్, మే 3 : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు ఖిల్లా రామాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉద్యోగార్థులకు కొనసాగుతున్న ఉచిత శిక్షణ తరగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం చౌడమ్మ కొండూర్లోని నర్సింహస్వామి ఆలయ పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆర్మూర్, మే 3 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 6న చేపట్టనున్న నూతన మార్క్‌ఫెడ్ భవన ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్ ఎండీ యాదిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి మార్క్‌ఫెడ్ భవన ప్రారంభోత్సవానికి రావాలని కోరారు.