
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 4 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమ ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్సీ కవిత సహకారంతో కొ నసాగుతున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలతో పాటు జిల్లా గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. పదవిలో లేకపోయినా సేవాభావంతో ప్రారంభించిన భోజన కార్యక్రమం నిరంతరం కొనసాగిందని.. ఇప్పటికి ప్రతిరోజూ వందల మంది ఆకలి తీరిస్తున్నదని అ న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గ్రంథాలయాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని వివరించారు. గ్రంథాలయాలకు వ చ్చే వి ద్యార్థులకు ప్రతి పుస్తకం అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జాగృతి నాయకులు అబ్దుల్ బాషిత్, నరాల సుధాకార్, తారీఖ్ అన్సారీ, నుడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
అన్నదానం గొప్ప కార్యక్రమం
ఎమ్మెల్సీ కవిత సహకారంతో కొనసాగుతున్న అన్నదానం కార్యక్రమం బ్రహ్మండమైంది. మంచి మనస్సు ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందువరుసలో ఉన్నది.
-దాదన్నగారి విఠల్‌రావు, నిజామాబాద్ జడ్పీ చైర్మన్
పిల్లల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణమ్మ
కరోనా సమయంలోనూ ఎమ్మెల్సీ కవిత పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించి ఆదుకున్నారు. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. అమ్మ స్థానంలో ఉండి పిల్లల కడుపు నింపుతున్నది. ఇలాంటి కార్యక్రమం నిరంతరం కొనసాగాలి.
-నీతూ కిరణ్, నగర మేయర్
అడిగిన వెంటనే ప్రారంభం
ప్రతి రోజూ గ్రంథాలయంలో పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం చాలా సంతోషంగా ఉంది. కరోనా సమయంలో నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని ఎమ్మెల్సీ కవితను కోరిన వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి.
-రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
ప్రజల గుండెల్లో నిలిచే కార్యక్రమం
రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. ఇప్పటి వరకు లక్షలాదిమందికి భోజనం పెట్టడం సంతోషంగా ఉంది.
-ప్రభాకర్‌రెడ్డి, నుడా చైర్మన్
నాణ్యమైన భోజనం..
ఎమ్మెల్సీ కవిత సహకారంతో కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా భోజన కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతిరోజూ వందలాది మందికి నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ప్రత్యేకంగా పరిశుభ్రమైన వంట గదిలో ప్రతిరోజూ కలెక్టర్, ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షణలో భోజనం తయారు చేయిస్తున్నాం.
-అవంతిరావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు