కలెక్టర్ హరిచందన
నారాయణపేట, సెప్టెంబర్ 7 : జిల్లాలో వినికిడి లోపం ఉన్న ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కావద్దని కలెక్టర్ హరిచంద న సూచించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో మంగళవారం పుట్టుకతో వినికిడి లోపం, మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కలిగిన 18 ఏండ్ల వయస్సు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వినికిడి పరికరాలను ఉచితంగా అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఈ పిల్లలు విద్యాభ్యాసం చేసే పాఠశాలలు హైదరాబాద్, మిర్యాలగూడ, కరీంనగర్లో మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారికి తెలియకపోవడం వల్ల నిర్లక్ష్యం చేసి విద్య కు దూరం చేస్తున్నారని, అందుకే జిల్లాలోని వినికిడి లోపం ఉ న్న పిల్లలకు యంత్రాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా వా రికి వైద్య పరీక్షలు నిర్వహించి అనువైన పాఠశాలల్లో ప్రవేశం క ల్పించామన్నారు. దామరగిద్ద, కోస్గి, మద్దూర్, ఉట్కూర్, ధన్వా డ, నారాయణపేట మండలాల వారిని పిలిపించామన్నారు. బు ధవారం మిగతా మండలాల వారిని పిలిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఆడియాలజిస్ట్‌లు సంగీత, శ్రీనివాస్‌రావు, జిల్లా సం క్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 7 : వానకాలం ధాన్యం కొ నుగోలుకు ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చే యాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ధాన్యం కొ నుగోలు సంసిద్ధతపై సంబంధిత జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ అక్టోబర్ మూడో వారంలో కోతలు ప్రారంభమై ధా న్యం చేతికి వస్తుందని, ఈ లోపల అన్ని ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా గోదాము ల సమస్య రాకుండా ఇప్పుడే ఏ ఏరియాలో ఎంత సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నయో జాబితా సిద్ధం చేసి ఇవ్వాల్సింది గా మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. గోదాములు ఏవై నా మరమ్మతులు ఉంటే చేయించాలన్నారు. రవాణా విషయం లో సమస్య తలెత్తకుండా ముందే కాంట్రాక్టర్‌తో మాట్లాడి తగి న చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మా కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ముందుగానే కొనుగోలు ఏ విధంగా చేయాలని, తేమ, తాలు వంటివి ప్రామాణికంగా చేసుకోవాలో అందరికీ శిక్షణ ఇవ్వాల్సిందిగా సివిల్ సైప్లె మేనేజర్‌ను ఆదేశించారు. వ్యవసాయ మండల అధికారుల ఆధ్వర్యంలో టోకెన్లు, బ్యాగుల పంపిణీ చేసే విధంగా చేసుకోవాలన్నారు. ఈసారి 2. 50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కానుందని, 2.10 టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స మావేశంలో సివిల్ సైప్లె మేనేజర్ హతీరామ్నాయక్, జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, డీఆర్డీవో పీడీ గోపాల్‌నాయక్, మెప్మా అధికారి కృష్ణమాచారి, మార్కెటింగ్ అధికారి బాలమణి, సివిల్ సైప్లె అధికారి శివకుమార్, ఆర్టీవో వీరస్వామి ఉన్నారు.