ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలు
చిన్నా, పెద్ద తేడా లేకుండా వేడుకలు
జడ్చర్ల, మార్చి 29 : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యాలు చేశారు. మహిళలు హోలీ పాటలు పాడుతూ ఇంటింటికీ వెళ్లి హోలీ ఆడారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 29 : మండలంలోని పెద్దాయపల్లి, గౌతాపూర్, ఉడిత్యాల, జాలుగడ్డతండా, రూప్లానాయక్‌తండా, వనమోనిగూడ, నామ్యతండా, జీడీగుట్టతండా, నేరళ్లపల్లి తదితర గ్రామాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. అలాగే ఆదివారం రాత్రి ఆయా గ్రామంలో కామదహనం నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు గంగారవినాయక్, దశ్రునాయక్, ఫీర్యానాయక్, ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తెప్ప మణి, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, రవినాయక్, గోపినాయక్, వస్పుల సాయిలు, కృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మార్చి 29 : మండలకేంద్రంతోపాటు కౌకుంట్ల, రాజోళి, పేరూర్ తదితర గ్రా మాల్లో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కామదహనం చేశారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, మార్చి 29 : మండలంలోని కొల్లూరు, మరికల్, చౌడూర్, దేపల్లి, కారుకొండ, లింగంపల్లి, లోకిరేవు, కాకర్లపహాడ్, ఇప్పటూర్ తదితర గ్రామాల్లో హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో యువకులు, చిన్నారులు పెద్దఎత్తున రంగులు చల్లుకొని సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 29 : మండలంలోని వేముల, దోనూర్, వల్లభురావుపల్లి, చిల్వేర్, మల్లాపూర్ తదితర గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందం పంచుకున్నారు. పలు గ్రామాల్లో మహిళలు హోలీ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకొన్నారు.