కోస్గి, ఆగస్టు 15 : మండలంలోని పం దిరి హనుమాన్ పాఠశాల ‘నమస్తే తెలంగా ణ’ వరుసకథనాలతో ఆదివారం తెరుచుకుంది. కొంతమంది ఉపాధ్యాయులు తమ స్వార్థానికి పాఠశాలను మూసి విద్యార్థులు లేరని పక్క పాఠశాలలో కలిపేశారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో పాఠశాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా తెరిచి పతాకావిష్కరణ చేశారు. నేటినుం చి పాఠశాలను కొనసాగిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడి విద్యార్థులంతా ఆన్లైన్ పాఠాలు విక్షీంచాలన్నారు. నూతన విద్య విధానంతో ఒకటి నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలంటే ఒక విద్యార్థి ఉన్నా పాఠశాలను కొనసాగించాలి. కానీ మున్నూర్వాడ పాఠశాలలో 40 మంది విద్యార్థులున్న తెరువకుండా స్థానిక బ్రా హ్మణ్వాడి పాఠశాలలో ఎందుకు కలిపారో నేటికి అర్థం కావడం లేదు.
పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బడి ప్రారంభించాలని ఉపాధ్యాయులు, ఎంఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించిన పాఠశాల తెరువకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికితోడు మున్నూర్వాడ పాఠశాలకు ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులకు నిధులు అందుతున్నాయి. పాఠశాలకు సొంత భవనం ఉం ది. అయినా పాఠశాల కొనసాగడం లేదు. స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ సైతం చేయలేదు. పాఠశాల నిధులు ఎక్కడకు మా యమౌతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న టీచర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో జెండావిష్కరణ చేయకపోతే పక్కనే ఉన్న అంగన్వాడీ టీచర్లు పా ఠశాల ఎదుట పతాకావిష్కరణ చేశారు. విషయం పై ఎంఈవో సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలకు తావిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’లో వరు స కథనాలు రావడంతో 15 రోజుల కిందట పాఠశాలలోని రికార్డులను ఉపాధ్యాయులు తీసుకెళ్ల్లిన ట్లు సమాచారం.