నారాయణపేట, ఆగస్టు 12 : నాగుల పంచమి రోజున పుట్ట వద్ద కు వెళ్లి విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేసి పాలు పోయడం చూ స్తుంటాం. దేశ వ్యాప్తంగా ఇలాగే జరుపుకొంటారు. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమిని నిర్వహిస్తారు. వినడానికి ఆశ్చర్యకంగా ఉన్నప్పటికీ ఇదే ఆచారాన్నే కొనసాగిస్తున్నారు. కందుకూరు, చుట్టు పక్క ల గ్రామస్తులు. ఎవరో ఒకరు.. ఇద్దరు ఇలా పాటిస్తున్నారనుకునే రు.. ఊరంతా ఇదే సంప్రదాయన్ని ఒక పండుగలా నిర్వహిస్తుండ డం విశేషం. అంతేగాక కొండపై తేళ్ల దేవత ఆలయం నిర్మించి, విగ్రహాలకు పాలు పోసి తేళ్ల పంచమి నిర్వహిస్తున్నారు.ఇంతటి ప్రత్యేకత ఉన్న తేళ్ల దేవత ఆలయం నారాయణపేట పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని కొండమవ్వ గుట్టపై ఉన్నది. గుట్టపై ఉన్న ఏ రాయిని తీసినా తేళ్లు ప్రత్యక్షమవుతాయి. నాగుల చవితి రోజున చిన్నారుల నుంచి పెద్దల వరకు తేళ్ల గుట్టపైకి వెళ్లి.. ముందుగా ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం రాళ్ల కింద ఉన్న తేళ్లను ముట్టుకున్నా.. శరీరంపై ఎక్కించుకున్నా.. నాలుకపై ఉంచుకున్నా ఎలాంటి హాని తలపెట్టకపోవడం విశేషం. ఒకవేళ కుట్టినా ఆలయంలోని విభూతిని పూస్తే తగ్గిపోతుందని ప్రజల నమ్మకం. ప్రతి ఏడాది నాగుల పంచమిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కాగా, ప్రస్తుతం కరోనా నేపథ్యం లో ఈ ఏడాది ఎవ్వరినీ అనుమతించడం లేదని ఆలయ నిర్వాహకులు, కర్ణాటక పోలీసులు తెలిపారు.
నారాయణపేట పట్టణం నుంచి యాద్గిర్కు వెళ్లే ప్రతి వాహనం కందుకూర్ గ్రామం మీదుగానే వెళ్తుంది. బస్సులు లేదా ప్రైవేట్ జీపుల్లో గ్రామానికి చేరుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వ రకు అరగంటకో బస్సు ఉంది. కందుకూర్ గ్రామ స్టేజీ వద్ద దిగి కొం డమవ్వ గుట్టపైకి కాలినడకన వెళ్లాలి.