జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్
నారాయణపేట, ఆగస్టు 29 : యువకులు, క్రీడాకారు లు చదువుతోపాటు క్రీడల్లో మంచిగా రాణించాలని జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని జిల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యత, ప్రతిభ వెలికితీయడం కోసం టగ్ ఆఫ్ వా ర్ అసోసియేషన్ రెండేండ్లుగా ఎంతో శ్రమిస్తుందన్నారు. హాకీ జాతీయ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ తన ప్రతిభతో నే డు యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. క్రీడా దినోత్సవా న్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెమెంటో, షీల్డ్‌లను బహుమతిగా అందజేశారు.
క్రీడా దినోత్సవ ర్యాలీ
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పేట జి ల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సత్యసాయిబాబా ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా, పోలీస్‌స్టేషన్, భరత్‌నగర్, అంబేద్కర్‌నగర్, బస్టాండ్ మీదుగా ఈ ర్యాలీని నిర్వహించారు. జాతీయ, అం తర్జాతీయ క్రీడాకారులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలం, గౌరవాధ్యక్షుడు రఘుప్రసన్నభట్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, వ్యా యామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు సన్మానం
నారాయణపేట రూరల్, ఆగస్టు 29 : మండలంలోని పాతతండాలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు విద్యార్థులు క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కనకప్ప, శ్రీనివాస్, తార్యానాయక్, చంద్రశేఖర్, రమేశ్‌నాయక్, రమణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.