రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14న హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు జగదీశ్‌రెడ్డి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాన చేయనున్నారు. అనంతరం హాలియాలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ మేరకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఏర్పాట్లనుపర్యవేక్షిస్తున్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, చిరుమర్తి లింగయ్యతో కలిసి బహిరంగ సభా స్థలినిపరిశీలించారు. అనంతరం పెద్దవూర మండలంలో ఇన్‌టెక్ వెల్‌ను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు సూచించారు.
హాలియా, మే 12 : ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హాలియాకు రానున్నారు. మంత్రి కేటీఆర్ హాలియాలో హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాలియాకు వచ్చారు.
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి సభాస్థలిని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంత్రి జగదీశ్‌రెడ్డికి వివరించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పెద్దవూర మండలం సుంకిశాల, నాగార్జున సాగర్‌లో మంత్రి పర్యటన కోసం చేపట్టిన పనులను పర్యవేక్షించారు. మంత్రి వెంట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఎడమ కాల్వ మాజీ వైస్ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కమిషనర్ వేమనరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యడవల్లి మహేందర్‌రెడ్డి, కామర్ల జానయ్య, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు, వర్రా వెంకట్‌రెడ్డి, వెంకటయ్య ఉన్నారు.