తుర్కపల్లి, మే 5 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ సూచించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంతోపాటు గంధమల్ల, వీరారెడ్డిపల్లి, వాసాలమర్రి, చిన్నలక్ష్మాపురం, ముల్కలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కార్యక్రమంలో తాసీల్దార్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఏఓ దుర్గేశ్వరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాటి మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటేశ్, ముత్యాలు, రామచంద్రం, సర్పంచులు శాగర్ల వాణీపరమేశ్, జక్కుల శ్రీవాణీవెంకటేశ్, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప, పడాల వనితాశ్రీనివాస్, నామసాని సత్యనారాయణ, ఎంపీటీసీలు కనకలక్ష్మి, సంతోష, ప్రతిభారాజేశ్, భాస్కర్‌నాయక్, శ్రీకాంత్, పుట్ట సాయిలు, సురేందర్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సింహులు అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో వరి సాగుచేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ బక్క మల్లేశ్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బాశెట్టి రాజు, వార్డు సభ్యులు గుర్రాల బాలరాజు, తొడేటి నరేందర్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : రైతులు అధైర్యపడొద్దని, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరులతో వేర్వేరుగా మాట్లాడారు.. రైతులకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు.