రామగిరి, ఏప్రిల్ 28 : వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్‌ను సీరియస్‌గా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం టెట్‌తోపాటు పోలీస్, గ్రూప్ 1, ఎక్సైజ్, రవాణా కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. నియోజకవర్ల కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా టెట్ నోటిఫికేషన్ విడుదల కాగా, అనంతరం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు భారీ ప్రకటన వెలువడింది. ఈ నెల 26న గ్రూప్-1, తాజాగా గురువారం ఎక్సైజ్, రవాణా కానిస్టేబుల్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రైవేట్ శిక్షణ సంస్థలు అభ్యర్థులతో కిక్కిరిస్తున్నాయి.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో నిరుద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 80,030 ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. జిల్లా, జోన్, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుండడంతో స్థానికులకు జాబ్స్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి.
ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందనే నమ్మకంతో ముందునుంచే గ్రూప్స్ కోచింగ్‌కు వెళ్తున్నా. ప్రస్తుతం గ్రూప్-1, 2కు శిక్షణ తీసుకుంటున్నా. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంత తొందరగా వస్తుందని అస్సలు ఊహించనేలేదు. గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడం ఇదే మొదటిసారి. ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యుల కల నెరవేర్చడంతో పాటు స్నేహితులకు స్ఫూర్తిగా నిలువాలనుకుంటున్నా.
– డి.సునీత, నల్లగొండ
గతంలో గ్రూప్-1 రాత పరీక్షలో ప్రతిభ చూపి ఇంటర్వ్యూలో వెనుకబడిన అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతామనే అభద్రత వారిలో తొలిగిపోయింది.
గ్రూప్స్ జాబ్ సాధించాలన్న లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటున్నా. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో నల్లగొండలోని భవిత ఇనిస్టిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తుండడం సంతోషంగా ఉంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. శిక్షణను సద్వినియోగం చేసుకోవడంతోపాటు సొంతంగా నోట్స్ సిద్ధం
చేసుకుంటున్నా.
– ఫిరోజ్, నల్లగొండ