నల్లగొండను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నూరు శాతం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి సీఎం కేసీఆర్ ప్రత్యేక రుజువు చేసింది. గురువారం నార్కట్‌పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ పెద్దకర్మకు సీఎం కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. ఎమ్మెల్యే నివాసంలో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, మంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడికక్కడే నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చిద్దామంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల, కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. చిరుమర్తి నివాసంలోనే 45 నిమిషాల పాటు నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి పనులపై సమీక్షించారు. నిధులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, పనుల్లో వేగం పెరుగాలని ఆదేశించారు. నల్లగొండ సమగ్రాభివృద్ధికి అవసరమైన మరిన్ని వరాలను మంజూరు చేశారు. వాటికి సంబంధించిన జీవోలన్నీ వారం రోజుల్లోనే
జారీ చేయాలని సంబంధిత వర్గాలకు సూచించారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్28(నమస్తే తెలంగాణ) నల్లగొండను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నల్లగొండను సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చేపట్టిన సమీక్ష రుజువు చేస్తున్నది. గురువారం నార్కట్‌పల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ పెద్దకర్మకు సీఎం కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. అనంతరం చిరుమర్తి నివాసంలో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, మంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం అక్కడికక్కడే నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధిపనులపై చర్చిద్దామంటూ నిర్ణయం తీసుకుని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి , కలెక్టర్, ఇతర అధికారులకు సూచించారు. దాంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలోనే సుమారు 45 నిమిషాల పాటు నల్లగొండతో పాటు నాగార్జునసాగర్‌లో జరుగుతున్న అభివృద్ధ్ది పనులపై సమీక్షించారు. గత డిసెంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య పెద్దకర్మలో పాల్గొనేందుకు వచ్చిన… సీఎం కేసీఆర్ స్వయంగా నల్లగొండలో పర్యటిస్తూ పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే యువనేత కేటీఆర్‌తో పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలను నల్లగొండకు పంపి, అభివృద్ధి పనుల కార్యచరణకు శ్రీకారం చుట్టారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్షిస్తూ నిరంతరం పనుల పురోగతిని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి జిల్లా పరిధిలోని నార్కట్‌పల్లికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గతంలో ప్రకటించని మేరకు పను లు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పాటిల్, కమిషనర్ రమణాచారితో పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న పనులపై ఫోటోలతో సహా అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇదే సమయంలో నల్లగొండకు మరిన్ని అవసరాలు ఉన్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సీఎం సానుకూలంగా స్పందిస్తూ నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నుంచి నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే మర్రిగూడ బైపాస్ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు వివరించారు. ఎంతో మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని, ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జీ నిర్మాణమే ప్రత్యామ్నాయం అంటూ వివరించారు.
దీంతో వెంటనే సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రూ.50 కోట్ల నిధుల మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు క్లాక్‌టవర్ సెంటర్లో శిథిలావస్థలో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ స్థానంలో అధునాతనంగా నాలుగు అంతస్తులు, ఆరు సూట్లు, కాన్ఫరెన్స్ హాల్‌తో కూడిన ఆధునిక అతిథి గృహాన్ని రూ.25 కోట్లతో మంజూరీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కలెక్టరేట్ ఆవరణలో ఆర్అండ్బీ కార్యాలయాన్ని రూ.10 కోట్లతో నిర్మించాలని కూడా ఆదేశించారు. వీటికి సంబంధించిన జీఓలన్నీ వారం రోజుల్లో జారీ చేసిన శంకుస్థాపన చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఫోన్లో సూచించారు.
ఇక ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని సాగర్ రోడ్డులోని ఎస్ఎల్బీసీలో నిర్మించాలని, దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు సీఎం సూచించారు. ఇక నల్లగొండ నడిబొడ్డున 2వేల మంది సామర్థ్ధ్యంతో కూ డిన నల్లగొండ కళాభారతిని అద్భుతంగా నిర్మించేలా డిజైన్లు రూ పొందించి తనను కలవాలని ఆదేశించారు. త్వరలోనే నల్లగొండ మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి మం త్రి జగదీశ్‌రెడ్డితో పాటు సంబంధిత మంత్రి హరీశ్‌రావులతో శంకుస్థాపన చేసుకోవాలని సూచించారు. నల్లగొండ అభివృద్ధ్దికి నిధుల సమస్య లేదని, ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని, పనులను గడువుతో పూర్తి చేయాలని సూచించారు. తాజా గా మంజూరు చేసి న వాటన్నింటినీ 6నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గురువారం సీఎం కేసీఆర్ ఆదేశించిన వెంటనే కార్యచరణ మొదలైంది. కళాభారతి, ట్యాంకుబండ్ డిజైన్లపై తుది రూపమిచ్చేందుకు నల్లగొండకు వచ్చి పరిశీలించాలని సీఎం కేసీఆర్, సిద్దిపేట మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్.వెంకట్రామిరెడ్డికి ఫోన్లో సూచించారు. సీఎం సూచన మేరకు సాయంత్రానికే నల్లగొండకు చేరుకున్న వెంకట్రామిరెడ్డి స్వయంగా పట్టణంలో పర్యటించారు. కళాభారతి నిర్మాణ స్థలాన్ని, పానగల్ ఉదయసముద్రం చెర్వుకట్టను, ఐటీ హాబ్ నిర్మాణ స్థలం, రహదారుల విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ఇప్పటికే జరుగుతున్న పనులపై చర్చించారు. వీటిల్లో చేర్పులుమార్పులపై చర్చించి తుదిరూపంతో సీఎం కేసీఆర్‌కు నివేదించాలని నిర్ణయించారు. ఇతర అభివృద్ధ్ది పనులపైనా తగు సూచనలు చేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది కోసం నిధులు పుష్కలంగా ఉన్నాయని, పనుల్లో వేగం పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండతో పాటు సాగర్ అభివృద్ధ్దిపైనా సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌తో అభివృద్ధి పనులపై చర్చించారు. అయితే మరో వారం రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధ్ది పనులపై హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమీక్షిద్దామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది.