మోత్కూరు, ఏప్రిల్ 20 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని పాటిమట్ల, దాచారం, పాలడుగు, ముశిపట్ల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయ కున్నా సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యానికి మద్దతు ధర చెల్లించి రైతులకు బాసటగా నిలుస్తున్నారని అన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, సర్పంచులు మల్లేశ్, రజితారాజిరెడ్డి, యా దయ్య, విజయానర్సిరెడ్డి, కార్యదర్శులు సోమన్న, శోభన్‌బాబు, ఏఈఓ అశోక్, సైదులు, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ఐకేపీ అధ్వర్యంలో అడ్డగూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కంచర్ల రామకృష్ణారెడ్డి, మండలంలోని ధర్మారంలో మందుల సామేల్ బుధవారం వేర్వేరుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు జోసెఫ్, వైస్ ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు మహేంద్రనాథ్, తీపిరెడ్డి మేఘారెడ్డి, తాసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, ఏపీఎం వెంకటేశ్వర్లు, చలపతిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మందోళ్లగూడెం, ఎస్.లింగోటం, అంకిరెడ్డిగూడెం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు. రైతులు కల్లాల వద్దనే ధాన్యం శుభ్రం చేసుకొని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ నర్సిరెడ్డి, ఎంపీటీసీ వెంకటేశం, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ సీఈఓ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
వలిగొండ : రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని నర్సాపురం, దుప్పెల్లి, వేములకొండ, ఎం.తుర్కపల్లి, వెల్వర్తి, నర్సయ్యగూడెం, లోతుకుంట, లింగరాజుపల్లి, రెడ్లరేపాక, అక్కంపల్లి, నాతాళ్లగూడెం, మాందాపురం గ్రామాల్లో ఐకేపీ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మాఅనంతరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మమతానరేందర్‌రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ కునపురి కవిత, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.