
చూడముచ్చటగా అభివృద్ధి పనులు
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
పల్లె ప్రగతి పనులతో నల్లగొండ మండలంలోని రసూల్పురం దశ మారింది. గతంలో వెలుగుపల్లి పంచాయతీ పరిధిలో భాగమైన ఈ ఆవాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడంతో మహర్దశ పట్టింది. మూడేండ్లుగా నిధుల కొరతను అధిగమించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్డు అన్నింటినీ పక్కపక్కనే నిర్మించడంతో ప్రత్యేక వాతావరణం ఏర్పడింది.
పల్లె ప్రగతి నిధులకు తోడు 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అన్ని గ్రామాల కంటే ముందుస్తుగా పురోగతి సాధించి ఇటీవల ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు దక్కించుకున్నది. రూ.22లక్షలతో వైకుంఠధామం, ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం, రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేశారు. వారంలో రెండుసార్లు ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్డులో కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారు. రూ.22లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేశారు. మిషన్ భగీరథ పైపులైన్లు పూర్తి చేసి నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు.
ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో భారీగా మొక్కలు నాటించారు. దాంతో పచ్చదనం పెరిగి ఆహ్లాద వాతావరణం నెలకొంది. నీడనిచ్చే వివిధ మొక్కలతో పాటు, 3వేలకు పైగా పూలు, పండ్ల మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అదే విధంగా అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 800, గ్రామ వీధుల్లో మరో 300మొక్కలు నాటారు. రెండేండ్ల కింద నాటిన మొక్కలన్నీ ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి.
మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం
గ్రామంలో మొక్కల సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం. గత హరితహారంలో గ్రామంలో 1,500పైగా మొక్కలు నాటించాం. అదే విధంగా పల్లెప్రకృతి వనంలో 3వేలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నాం. ప్రస్తుతం అవన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూస్తున్నాం.
ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం..
ప్రజల సహకరంతో గ్రామా న్ని అన్ని రంగా ల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం. రూ.22లక్షలతో సీసీ రోడ్డు వేసినం. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా వైకుం ఠ ధామం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అన్ని పనులు వేగంగా పూర్తి చేసి ఉత్తమ పంచాయతీగా అవార్డు తీసుకున్నాం.