
చివ్వెంల, ఆగస్టు 15 : కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మం డలం ఖాసీంపేట గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన చుండ్రు సాయిరామ్ బట్టల వ్యాపారి. కుటుంబ సభ్యులతో కలిసి తమ కారులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె వద్ద గల మోపుదేవి ఆలయంలో మనుమరాలు జశ్వంతి పుట్టు వెంట్రుకలు తీసేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఖాసీంపేట గ్రామ శివారులో కుక్క ఒక్కసారిగా అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్ల్లి చెట్టును ఢీకొని చిన్న కాల్వలో పడింది. దీంతో కారు లో ఏడుగురు ఉండగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యా యి. పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.