
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, అక్టోబర్9 : రాష్ట్ర సంక్షేమ పథకాలు ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం రామన్నపేట, కొమ్మాయిగూడెం, కొత్తగూడెం, శోభనాద్రిపురం గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 52 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్య పడొద్దని, ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. శోభనాద్రిపురంలో వంతెన పూర్తికి హామీ ఇచ్చారు. కొమ్మాయిగూడెంలో సీసీరోడ్డు, డ్రైన్, అంగన్వాడీకేంద్రం, కొత్తగూడెంలో సీసీ రోడ్లు, లక్ష్మాపురంలో గౌడసంఘం భవనం పూర్తికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కొమ్మాయిగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గుత్తా నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముక్కాంల దుర్గయ్య, సర్పంచులు గోదాసు శిరీషాపృథ్వీరాజ్, చిల్లర కైలాసం, జెల్లెల లక్ష్మమ్మ, అప్పం లక్ష్మినర్సు, అంతటి పద్మారమేశ్, నీల జయలక్ష్మి, మెట్టు మహేందర్‌రెడ్డి, బొక్క పురుషోత్తంరెడ్డి, రేఖ యాదయ్య, ఉప్పు ప్రకాశ్, కడమంచి సంధ్య, కోళ్లస్వామి, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, ఎండీ రేహాన్, వనం హర్షిణి, గాదె పారిజాత, ఎండీ ఆమేర్ నాయకులు బందెల రాములు, కంభంపాటి శ్రీనివాస్, మందడి శ్రీధర్‌రెడ్డి, బొక్క మాధవరెడ్డి, బత్తుల వెంకటేశ్ పాల్గొన్నారు.