
నేరేడుచర్లలో ఎన్నికల తీరును పరిశీలించిన ఎంపీ బడుగుల
హుజూర్నగర్ 17వ వార్డు ఎన్నికలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు
నేరేడుచర్ల, సెప్టెంబర్ : నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గురువారం నేరేడుచర్ల మండలంలో జరిగిన ఎన్నికల తీరును ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వల్లంశెట్ల రమేశ్‌బాబు ఇటీవల గాయపడగా ఆయన గృహానికి వెళ్లి పరామర్శించారు. టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు చింతకుంట్ల సోమిరెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్ సాయి, కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, నాయకులు అరిబండి సురేశ్‌బాబు, ఇంజమూరి రాములు, ఆకారపు వెంకటేశ్వర్లు, పిడమర్తి రాజు పాల్గొన్నారు.
చింతలపాలెం మండలంలో..
చింతలపాలెం : మండలంలోని రేబల్లె, పీక్లానాయక్‌తండా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు మోర్తాల వెంకట్‌రెడ్డి తెలిపారు. రేబల్లె గ్రామ అధ్యక్షుడిగా ముడియాల వెంగళ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా చెడపంగు గోవింద్, కార్యదర్శిగా కొమ్మరబోయిన వీరస్వామి, పీక్లానాయక్‌తండా అధ్యక్షుడిగా భూక్యా ఉపేందర్, ఉపాధ్యక్షుడిగా బదావత్ నాగా, కార్యదర్శిగా బాణావత్ రావు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పొల్నేడి శ్రీనివాస్‌రావు, నాయకులు పెద్దిరెడ్డి, వెంకటేశ్వర్లు, పేతురు, నరసింహారావు, నరసింహారెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
గరిడేపల్లి మండలంలో..
గరిడేపల్లి : మండలంలో గానుగుబండ అధ్యక్షుడిగా కొత్త సతీశ్‌రెడ్డి, కాల్వపల్లి అధ్యక్షుడిగా శవ్వ అనిల్, అబ్బిరెడ్డిగూడెం అధ్యక్షుడిగా చల్లా నాగయ్య, వెంట్రామాపురం అధ్యక్షుడిగా యల్లబోయిన సైదులు, మర్రికుంట అధ్యక్షుడిగా బాల్తు రవితోపాటు అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, పరిశీలకులు కె.సత్యనారాయణరెడ్డి, వినాయకరావు, గిరి, జెల్లా మార్కండేయులు, సైదిరెడ్డి, ముచ్చపోతుల కృష్ణ, పార్థసారథి. గానుగుబండ సర్పంచ్ పంగ వీరస్వామి, నాగుల్‌మీరా పాల్గొన్నారు.
మఠంపల్లి మండలంలో..
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం అధ్యక్షుడిగా పెద్దబోయిన సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా చలికంటి సైదులు, ప్రధాన కార్యదర్శిగా బోనాల నారపరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు, పరిశీలకుడు పుల్లారెడ్డి, మసీద్ కమిటీ అధ్యక్షుడు పఠాన్ హఫీజ్‌ఖాన్, సీతారాములు, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
అంజలీపురం, కరక్కాయలగూడెం కమిటీలు..
హుజూర్‌నగర్‌టౌన్ : మండలంలోని అంజలీపురం అధ్యక్షుడిగా ఆవులదొడ్డి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా కారింగుల శ్రీను, కరక్కయాలగూడెం అధ్యక్షుడిగా కీత కృష్ణమోహన్, ఉపాధ్యక్షుడిగా కోట నాగేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చావా వీరభద్రారావు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబీ, నాయకులు నారాయణరెడ్డి, ధనమూర్తి పాల్గొన్నారు.
పాలకవీడు మండలంలో..
పాలకవీడు : మండలంలోని రాఘవాపురం అధ్యక్షుడిగా యడవల్లి చిన్న సైదులు, ఉపాధ్యక్షుడిగా కొణతం లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అమరారపు సైదులు, మీగడంపహాడ్ తండా అధ్యక్షుడిగా ధరావత్ హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా భూక్యా సక్కూనాయక్, ప్రధాన కార్యదర్శిగా రూపావత్ బాలు, గుండ్లపహాడ్ అధ్యక్షుడిగా గోళ్ల పవన్, ఉపాధ్యక్షుడిగా మల్లెల నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా జాల నాగయ్య, దేవులతండా అధ్యక్షుడిగా మాలోతు కోట్యానాయక్, ఉపాధ్యక్షుడిగా బానావత్ సైదా, ప్రధాన కార్యదర్శిగా బానావత్ శంకర్‌నాయక్, గుండెబోయినగూడెం అధ్యక్షుడిగా యాతం వెంకటనాయుడు, ప్రధాన కార్యదర్శిగా చప్పిడి ప్రశాంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలిమంటి దర్గారావు, ఎన్నికల ఇన్చార్జీలు చందమళ్ల జయబాబు, నాగండ్ల శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ కిష్టపాటి అంజిరెడ్డి, తాటికొండ వెంకట్‌రెడ్డి, రామచందర్, సుందరయ్య, సైదా పాల్గొన్నారు.
నేరేడుచర్ల మండలంలో..
నేరేడుచర్ల/కోదాడ టౌన్ : నేరేడుచర్ల మండలంలోని పుల్గంబండతండా అధ్యక్షుడిగా రమావత్ సైదా, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ గోవింద్, రోళ్లవారిగూడెం అధ్యక్షుడిగా కోడి అనిల్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీ నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగయ్య, ఉపాధ్యక్షుడు సుదర్శన్, మాజీ జడ్పీటీసీ రాజు పాల్గొన్నారు. కోదాడలోని 31వ వార్డు అధ్యక్షుడిగా తాడేపల్లి గోవిందరావు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా గరిడేపల్లి మమతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణాధ్యక్షుడు నాగేశ్వర్రావు, కౌన్సిలర్ సుశీల, వనపర్తి లక్ష్మీనారాయణ, రాయపూడి వెంకటనారాయణ, ఒంటిపులి నాగరాజు, వెంపటి మధు, చల్లా ప్రకాశ్, సుధాకర్ పాల్గొన్నారు.
రెడ్లకుంట అధ్యక్షుడిగా సతీశ్
కోదాడ రూరల్/చిలుకూరు : కోదాడ మండలంలోని రెడ్లకుంట అధ్యక్షుడిగా పొట్ల సతీశ్, కార్యదర్శిగా నారసాని రామకృష్ణను ఎన్నుకున్నారు. అప్పారావు, క్రాంతి, కోటేశ్వర్రావు, పుల్లారావు, హరిబాబు పాల్గొన్నారు. చిలుకూరు గ్రామకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జానీమియా, డీసీసీబీ డైరెక్టర్లు కొండా సైదయ్య, కస్తూరి నర్సయ్య, మాజీ ఎంపీపీ నాగేంద్రబాబు, ఎంపీటీసీ రమణ, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్, మాజీ జడ్పీటీసీ శివాజీనాయక్, డీసీసీబీ డైరెక్టర్ కస్తూరి నర్సయ్య పాల్గొన్నారు.
17వ వార్డు కమిటీ..
హుజూర్నగర్, సెప్టెంబర్ 9 : పట్టణంలోని 17వ వార్డు అధ్యక్షుడిగా రాగి రాజశేఖర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కాకి సంధ్య, యూత్ అధ్యక్షులుగా సంగిశెట్టి జయంత్, గుర్రపుశాల వినీత్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పచ్చిపాల ఉపేందర్, బెల్లంకొండ అమర్ పాల్గొన్నారు.