
పోటెత్తారు. అరుదైన రోజున స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.
చెర్వుగట్టులోని రామలింగేశ్వర క్షేత్రం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసి
పోయింది.
నార్కట్పల్లి, ఆగస్టు 8 : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రామలింగేశ్వరుడికి లక్ష పుష్పార్చనను ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి క్షేత్రంలో నిద్రచేశారు. ఎల్లమ్మ అమ్మవారికి డప్పు దరువులతో బోనాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి భక్తులకు మౌలిక వసతులు కల్పించారు.