
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండలో పలు వార్డు పార్టీ ఎన్నికలు
జోరుగా గ్రామ కొత్త కమిటీలు
నీలగిరి, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పట్టణంలోని 12, 26, 27, 28, 29, 30, 31వ వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులను ఎమ్మెల్యే ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధేయత కలిగి పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకపోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అంతకుముందు 1, 2, 3, 18, 19, 39, 41వ వార్డులకు సంబంధించి అనుబంధ సంఘాల సభ్యులను జడ్పీ కోఆప్షన్ సభ్యుడు జాన్శాస్త్రి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. 12వ వార్డు అధ్యక్షుడిగా పబ్బతిరెడ్డి అంజిరెడ్డి, 26వ వార్డుకు ఎండీ మసీరుద్దీన్, 27వ వార్డుకు చకిలంభట్ల భజరంగ్‌ప్రసాద్, 28వ వార్డుకు బద్దెల జగదీశ్‌యాదవ్, 29వ వార్డుకు దుబ్బ అశోక్‌సుందర్, 39వ వార్డుకు మామిడి పద్మ, 31వ వార్డుకు కుకునూరి జలంధర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పార్టీ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, మహ్మద్ ఖయ్యూంబేగ్, బషీరుద్దీన్, ఎడ్ల శ్రీనివాస్, జమాల్‌ఖాద్రీ, సంకు ధనలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.
నాలుగు గ్రామాల్లో కొత్త కమిటీలు
నార్కట్‌పల్లి : మండలంలోని 4 గ్రామాల్లో గ్రామ కమిటీలను మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నక్కలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా విష్ణుమూర్తి, కార్యదర్శిగా కరుణాకర్‌రెడ్డి, తొండల్వాయి మల్లం అంజయ్య, చింత స్వామి, ఎనుగులదోరి గోపాల్‌రెడ్డి, శిగ మురళి, చిన్ననారాయణపురం శ్రీనివాస్ రెడ్డి, రమేశ్‌ను ఎన్నుకున్నారు.
కట్టంగూర్ మండలంలో..
కట్టంగూర్ : మండలంలోని మల్లారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెద్ది మల్లేశ్‌గౌడ్, నల్లకుంటబోళ్లకి పొన్నబోయిన రామచంద్రు, అయిటిపాములకి చౌగోని నాగరాజు, భాస్కర్లబాయికి ఎన్న ఎల్లారెడ్డి, ఇస్మాయిల్‌పల్లికి అలుగుబెల్లి శేఖర్‌రెడ్డి, రామచంద్రపురానికి నీలం గణేశ్, ఎరసానిగూడేనికి రామచంద్రును ఎన్నుకున్నారు, కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు.
శాలిగౌరారం మండలంలో..
శాలిగౌరారం : మండలంలోని వల్లాల టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొన్రెడ్డి వేణుగోపాల్‌రెడ్డిని ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, పరిశీలకుడు కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య తెలిపారు. ఉపాధ్యక్షుడిగా బొడ్డు పరమేశ్, కార్యదర్శిగా భూపతి నాగరాజు, యువజన అధ్యక్షుడిగా బొడ్డు మల్లేశ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. అంబారిపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా తోట సోమయ్య, ఉపాధ్యక్షుడిగా మొలుగూరి జయన్న, యువజన విభాగం అధ్యక్షుడిగా మొలుగూరి బాలును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో దుబ్బ వెంకన్న, గర్దాసు లింగయ్య, దాసరి నథానియేల్, చెవుగాని అశోక్, ఉపేందర్‌గౌడ్, లింగయ్య, సర్పంచ్ బీరం శోభానర్సిరెడ్డి, దావీద్, నారగోని వీరయ్య ఉన్నారు.
కేతేపల్లి మండలంలో..
కేతేపల్లి : మండలంలోని కొర్లపహాడ్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా అనుముల సత్యనారాయణ, ఇప్పలగూడెం గ్రామాధ్యక్షుడిగా మట్టిపల్లి వినోద్కుమార్యాదవ్ను ఎన్నుకున్నారు. వీరికి పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి నియామకపత్రం అందించారు. ఇప్పలగూడెం సర్పంచ్ డి.వీరయ్య నాయకులు చిముట వెంకన్నయాదవ్, చైతన్కుమార్, విజయరాణి, జి.సత్యనారాయణ, సుధాకర్, ధన్‌రాజ్, బి.అంజయ్య, ఇబ్రహీం పాల్గొన్నారు.
నేటి నుంచి టీఆర్ఎస్ మండల కమిటిలు
నాంపల్లి : మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండలంలో నేటి నుంచి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.