
ఎమ్మెల్యే నోముల భగత్
ఉత్సాహంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక
హాలియా, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ గ్రామ కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల మండలం హజారిగూడెం, నాయుడుపాలెం, చల్మారెడ్డిగూడం, కొట్టాల గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉండి పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రావుల చినభిక్షం, ఎంపీటీసీ రావులరాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, ఉపాధ్యక్షుడు పోశం శ్రీనివాస్, సర్పంచ్ శేఖర్, నాయకులు చేగొండి కృష్ణ, గోపాల్‌రెడ్డి, దుబ్బ శివాజీ, షేక్ గౌస్, దుండిగల్ల శ్రీను. కోటి పాల్గొన్నారు.
వార్డు కమిటీల ఎన్నికలు
దేవరకొండ : పట్టణంలోని 8 వార్డుల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా పొట్టమురళి, 8 వార్డుకు పైడిమర్రి విశ్వం, 11వార్డుకు ఎండీ. మహబూబ్ అలీ, 14 వార్డుకు పున్న పర్వతాలు, 15 వార్డుకు ఎజాజుల్లాఖాన్, 16 వార్డుకు బొడ్డుపల్లి భీష్మాచారి, 17 వార్డుకు పొట్ట రాము, 19 వార్డుకు కుంటల విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, నాయకులు గార్లపాటి దామోదర్, చిత్రం ప్రదీప్, పొట్ట మధు, ఏసోబు, వెంకటయ్య బుచ్చయ్య పాల్గొన్నారు
పేర్వాల గ్రామ కమిటీ
నేరేడుగొమ్ము(చందంపేట) : మండలంలోని పేర్వాల గ్రామంలో మంగళవారం టీఆర్ఎస్ కమిటీని పార్టీ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కూరాకుల రామస్వామి, కార్యదర్శిగా సైదయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కేతావత్ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ ముక్కమళ్ల బాలయ్య, మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, సర్పంచ్ బషీర్, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య పాల్గొన్నారు.
చింతపల్లి మండలంలో..
మాల్ : చింతపల్లి మండలంలోని బోటిమీదితండా, తక్కెళ్లపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. అనంతరం వారికి ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నట్వగిరిధర్, నాయకులు మాస భాస్కర్, బాదెపల్లి పులిరాజుగౌడ్, అక్రమ్యాదవ్, శ్రీశైలం, యాదయ్య, మల్లప్ప పాల్గొన్నారు.
చైతన్యనగర్ కమిటీ
మిర్యాలగూడ : పట్టణంలోని ఒకటో వార్డు చైతన్యనగర్ టీఆర్ఎస్ కమిటీని మంగళవారం మున్సిపల్ వైస్‌చైర్మన్ కుర్ర విష్ణు సారధ్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింతకాయల నగేశ్, ఉపాధ్యక్షుడిగా శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి ఏసు, వివిధ విభాగాల అధ్యక్షులుగా కళ్యాణ్‌కుమార్, సత్యనారాయణ, సోమేశ్వర్రావు, అంజమ్మ, సుధాకర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు పునాటి లక్ష్మీనారాయణ, నాగయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) మండలంలో..
తిరుమలగిరి సాగర్ : మండలంలోని మేగ్యాతండా, ధన్‌సింగ్‌తండా, కీచ్యాతండా, నేతాపురం, తునికినూతల గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను పార్టీ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కట్టెబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, భగత్ యువసేన అధ్యక్షుడు నయీంపాషా, గిరిజన నాయకుడు బిచ్యానాయక్, ఎంపీటీసీ భార్గవీ శ్రీనివాస్‌రెడ్డి, తిరుమలేశ్, కిరణ్, దేవుడునాయక్ పాల్గొన్నారు.
గుర్రంపోడు మండలంలో..
గుర్రంపోడు : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. పాశంవారిగూడెం అధ్యక్ష, కార్యదర్శులుగా పాశం యాదగిరిరెడ్డి, పాశం వెంకట్‌రెడ్డి, బుడ్డారెడ్డిగూడేనికి బొల్లం శ్రీనివాస్, రేబెల్లి రామరాజు, జిన్నాయిచింతకు గంటెల శంకర్, మల్లెబోయిన శ్రీను, బ్రాహ్మణగూడేనికి కట్టెబోయిన రాంబాబు, గోగుల శివకోటి, కాచారానికి ఎండీ ఖాసీం, నల్ల కృష్ణ, తానేదార్పల్లికి గుర్రం హనుమంతు, శ్రీరామదాసు సందీప్, ఎల్లమోనిగూడేనికి కూర నరేశ్, కటికం రామచంద్రం, గాసీరాంతండాకు మెగావత్ చిరంజీవి, రవీందర్, మైలాపురానికి దండు యాదగిరి, పంజం దామోదర్‌రెడ్డి, జూనూతలకు బుయ్యా యాదగిరి, కుంభం గోవర్ధన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి పాశం గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
నిడమనూరు మండలంలో..
నిడమనూరు : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ కమిటీలను ఎన్నుకున్నారు. అనంతరం ముకుందాపురం గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా వంగాల వెంకన్న, మంజుల విజయ్, ఇండ్లకోటయ్య గూడెంలో మార్తి రంగారెడ్డి, నార్ల రామకృష్ణ, తుమ్మడెంలో రావుల గోవిందు, నారమ్మ గూడెంలో పొంతటి యుగంధర్‌రెడ్డి, షేక్ సైదులు, వడ్డెరిగూడెంలో బత్తుల నగేశ్, గోగుల మహేశ్, రేగులగడ్డలో మాతంగి రవి, కదిరె నాగరాజు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నూకల వెంకట్‌రెడ్డి, బొల్లం రవియాదవ్, రాం అంజయ్య యాదవ్, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నల్లబోతు వెంకటేశ్వర్లు, సర్పంచులు కేశ శంకర్, జంగిలి రాములు, గోగుల మహేశ్, ఎంపీటీసీ పెదమాం యాదయ్య, జాల పాపయ్య, సోమనబోయిన శ్రీనివాస్ యాదవ్, మేరెడ్డి వెంకటరమణ, ఉన్నం ఈశ్వర్, పగిళ్ల శివ, గోవిందు పాల్గొన్నారు.
కట్టకొమ్ముతండాలో..
దేవరకొండరూరల్ : మండలంలోని కట్టకొమ్ముతండా గ్రామ కమిటీ మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నేనావత్ నర్సింహ ఎన్నికవగా.. జడ్పీటీసీ సలహాదారుడు మారుపాక సురేశ్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుభాశ్‌గౌడ్ ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో బాలయ్య, నర్సింహ, సుదర్శన్, రాజ్‌కుమార్, చిన్న పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం
త్రిపురారం : టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. త్రిపురారం అధ్యక్షుడిగా జంగిలి శ్రీనివాస్, పెద్దదేవులపల్లి కర్రె నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బహునుతుల నరేందర్, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ జయరాం నాయక్, సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మర్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
పీఏపల్లి మండలంలో..
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఎన్నుకున్నారు. పడమటితండా అధ్యక్ష, కార్యదర్శులుగా కిషన్‌నాయక్, సేవానాయక్, చింతలతండాకు భక్షా, నగేశ్, పుట్టంగండికి బాషా, జవహర్లాల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తేరా స్పందనారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, నాయకులు ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్ పాల్గొన్నారు.