
చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, నాంపల్లి మండలానికి చెందిన సర్పంచులు సుధాకర్, రమేశ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టిదెబ్బ అనే చర్చ స్థానికంగా వినిపించింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు కొందరు కూడా టీఆర్ఎస్ కండువాలు
కప్పుకొన్నారు.
చండూరు, అక్టోబర్ 4 : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, పలువురు కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీలు, చేనేత సహకార సంఘాల నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్ రెడ్డి సహా సుమారు 400 మంది ఇతర పార్టీల నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, చండూరు రైతు సహకార సంఘం చైర్మన్ కోడి సుష్మా వెంకన్న, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు పాల్గొన్నారు. పార్టీలో చేరినవారు మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి సంతోష, మున్సిపల్ కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు సంకోజు దుర్గమ్మ, సంకోజు సాయన్న, బెల్లంకొండ శేఖర్, చేనేత సహకార సంఘం నాయకుడు జూలూరి వెంకటేశం, నాంపల్లి మండలానికి చెందిన సర్పంచులు సుధాకర్, రమేశ్, బోడ శ్రీకాంత్, గండూరి నగేశ్, రామగిరి సురేశ్, ఇరిగి దుర్గాప్రసాద్, నారపాక మహేశ్, నాగరాజు, కురుపాటి యాలాద్రి, మేడిపల్లి రాము, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
నాంపల్లి మండలానికి చెందిన పలువురు..
నాంపల్లి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రైతు బంధు సమితీ మండలాధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో మండలానికి చెందిన పలువురు సోమవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో బండతిమ్మాపురం, దేవత్‌పల్లి సర్పంచులు రెవెల్లి సుధాకర్, కుందారపు రమేశ్, ఉప సర్పంచ్ జెక్కుల అలివేలు ధనుంజయ, మాలే రాజశేఖర్‌రెడ్డి, వేనేపల్లి జయప్రకాశ్, మాజీ సర్పంచులు ముదిగొండ దుర్గయ్య, మల్లేపల్లి వెంకట్‌రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన 150 మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్మార్కెట్ డైర్టెర్ కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య ఉన్నారు.