
తిరుమలగిరి మండలంలో
2,382 దళిత కుటుంబాలు
ఈ ఆరేండ్లలో మరో 100కి పైగా పెరిగిన సంఖ్య
తిరుమలగిరి, సెప్టెంబర్ 3 : దళిత బంధు పైలెట్ పథకం కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,500 దళిత కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మండలంలో 2,382 దళిత కుటుంబాలు లెక్క తేలాయి. అయితే, ఈ ఆరేండ్లలో మరో 118కుటుంబాలు అదనంగా పెరిగాయని, ఆ మేరకు అన్ని కుటుంబాల సంఖ్య 2,500వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ రూ.10లక్షల చొప్పున రూ.250కోట్లు కేటాయించింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తిరుమలగిరి మండల కేంద్రంలో 793 దళిత కుటుంబాలున్నాయి. గ్రామపంచాయతీల వారీగా
వివరాలివీ..
గ్రామం ఎస్సీ కుటుంబాలు
బండ్లపల్లి 28
గుండెపురి 147
జలాల్పురం 197
మామిడాల 76
తాటిపాముల 390
గ్రామం ఎస్సీ కుటుంబాలు
తొండ 225
వెలిశాల 107
అనంతారం 142
మాలీపురం 231
నందాపురం 46